iDreamPost
android-app
ios-app

డిగ్రీ అర్హతతో ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షకు పైగా జీతం

ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. డిగ్రీ అర్హతతో ఎయిర్ పోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. లక్షకు పైగా జీతం పొందొచ్చు.

ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. డిగ్రీ అర్హతతో ఎయిర్ పోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. లక్షకు పైగా జీతం పొందొచ్చు.

డిగ్రీ అర్హతతో ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగాలు..  నెలకు రూ. లక్షకు పైగా జీతం

మీరు డిగ్రీ ఉత్తీర్ణులై ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా? ప్రభుత్వ ఉద్యోగం సాధించడం మీ లక్ష్యమా? ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నారా? అయితే మీలాంటి వారికి ఓ గుడ్ న్యూస్ ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. డిగ్రీ అర్హతతోనే మీరు ఎయిర్ పోర్టులో ఉద్యోగం సాధించొచ్చు. అంతేకాదు నెలకు రూ. లక్షకు పైగా జీతాన్ని పొందే అవకాశం ఉంది. ఇలాంటి అవకాశం మళ్లీ మళ్లీ రాదు. మీకు గవర్నమెంట్ జాబ్ కొట్టాలనే కసి ఉంటే ఇలాంటి జాబ్స్ కొట్టి జీవితంలో సెటిల్ అయిపోండి. మరి ఇంకెందుకు ఆలస్యం త్యరగా అప్లై చేసుకోండి.

చెన్నైలోని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)- సదరన్ రీజియన్‌లోని వివిధ విమానాశ్రయాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 119 జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, లక్షద్వీప్ దీవులకు చెందినవారు అప్లై చేసుకునేందుకు అర్హులు. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జనవరి 26 2024 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్ సైట్ https://www.aai.aero/ ను పరిశీలించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన సమాచారం:

  • మొత్తం పోస్టులు:
  • 119.

విభాగాల వారీగా ఖాళీలు:

జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీస్):

  • 73 పోస్టులు

అర్హత:

  • పదోతరగతితోపాటు మూడేళ్ల డిప్లొమా (మెకానికల్/ఆటోమొబైల్/ఫైర్) లేదా ఇంటర్ అర్హత ఉండాలి.

జూనియర్ అసిస్టెంట్ (ఆఫీస్):

  • 02 పోస్టులు

అర్హత:

  • డిగ్రీ

సీనియర్ అసిస్టెంట్ (ఎలక్ట్రానిక్స్):

  • 25 పోస్టులు

అర్హత:

  • డిప్లొమా (ఎలక్ట్రానిక్స్/టెలికమ్యూనికేషన్/రేడియో ఇంజినీరింగ్). సంబంధిత విభాగంలో రెండేళ్ల అనుభవం ఉండాలి.

సీనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్‌):

  • 19 పోస్టులు

అర్హత:

  • బీకామ్ డిగ్రీ ఉన్నవారికి ప్రాధాన్యం.

వయోపరిమితి:

  • అభ్యర్థులకు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ లైన్

ఎంపిక విధానం:

  • కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, కంప్యూటర్ లిటరసీ టెస్ట్, ఫిజికల్ మెజర్‌మెంట్/ఎండ్యూరెన్స్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.

జీతం:

  • నెలకు సీనియర్ అసిస్టెంట్‌ పోస్టులకు రూ.36,000 – రూ.1,10,000; జూనియర్ అసిస్టెంట్‌ పోస్టులకు రూ.31,000 – రూ.92,000 జీతంగా అందిస్తారు.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:

  • 27-12-2023.

దరఖాస్తుకు చివరితేది:

  • 26-01-2024.

అధికారిక వెబ్ సైట్ :

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి