iDreamPost
android-app
ios-app

నెలకు రూ.55,000 జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఈ అర్హతలుండాలి?

  • Published Jan 27, 2024 | 5:07 PM Updated Updated Jan 27, 2024 | 5:07 PM

కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు ఏకంగా రూ. 55 వేల జీతాన్ని పొందొచ్చు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. వెంటనే అప్లై చేసుకోండి.

కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు ఏకంగా రూ. 55 వేల జీతాన్ని పొందొచ్చు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. వెంటనే అప్లై చేసుకోండి.

  • Published Jan 27, 2024 | 5:07 PMUpdated Jan 27, 2024 | 5:07 PM
నెలకు రూ.55,000 జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఈ అర్హతలుండాలి?

ప్రస్తుత కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలకు విపరీతమైన కాంపిటీషన్ ఉంది. గవర్నమెంట్ జాబ్స్ వందల్లో ఉంటే పోటీ పడే వారి సంఖ్య మాత్రం లక్షల్లో ఉంటుంది. అయినప్పటికీ సరైన ప్రణాళిక.. అంకితభావం ఉన్నట్లైతే ప్రభుత్వ ఉద్యోగం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నట్లైతే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు ఏకంగా రూ. 55 వేల జీతాన్ని పొందొచ్చు. మరి ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరు? వయోపరిమితి ఎంత? దరఖాస్తు చివరి తేదీ ఎప్పుడు? వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

న్యూఢిల్లీలోని నేషనల్ థర్మల్ వపర్ కార్పొరేషన్ (ఎన్‌టీపీసీ) లిమిటెడ్, ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 223 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న వారు ఫిబ్రవరి 8 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోదలిచిన వారు పూర్తి సమాచారం కోసం ఎన్టీపీసీ అధికారిక వెబ్ సైట్ ను https://www.ntpc.co.in/ పరిశీలించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన సమాచారం:

అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల సంఖ్య:

  • 223

అర్హత:

  • అభ్యర్థులు బీఈ, బీటెక్‌ (ఎలక్ట్రికల్/ మెకానికల్ ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణులై ఉండాలి.

అనుభవం:

  • అభ్యర్థులు పవర్ ప్లాంట్ ఆపరేషన్/మెయింటెనన్స్ విభాగాల్లో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.

వయోపరిమితి:

  • అభ్యర్థుల వయసు 35 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు ఫీజు:

  • అభ్యర్థులు రూ.300 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ లైన్

ఎంపిక విధానం:

  • అప్లికేషన్‌ స్క్రీనింగ్, షార్ట్‌లిస్టింగ్, సెలెక్షన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు

జీతం:

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.55,000 అందిస్తారు.

దరఖాస్తు ప్రారంభం:

  • 25-01-2024

దరఖాస్తుకు చివరి తేదీ:

  • 08-02-2024.

ఎన్టీపీసీ అధికారిక వెబ్ సైట్:

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetcasinolevant girişEscortes BelgiqueCasibomCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomCasibomBetcio