P Venkatesh
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు ఇదే మంచి సమయం. వెంటనే ఈ పోస్టులకు అప్లై చేసుకోండి.
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు ఇదే మంచి సమయం. వెంటనే ఈ పోస్టులకు అప్లై చేసుకోండి.
P Venkatesh
ప్రైవేట్ ఉద్యోగాలతో పోలిస్తే ప్రభుత్వ ఉద్యోగాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్ కు మంచి జీతంతో పాటు బోలెడన్నీ సదుపాయాలను కల్పిస్తుంటాయి ప్రభుత్వాలు. ఈ కారణంగా యువత ప్రభుత్వ కొలువులను సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తుంటారు. మరి మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నారా? మీరు డిగ్రీ పాసైనట్లైతే మీకు ఇదే మంచి అవకాశం. డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను పొందే అవకాశం వచ్చింది. న్యూఢిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (అసిస్టెంట్ కమాండెంట్) ఎగ్జామినేషన్-2024 నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ పరీక్ష ద్వారా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్, సశస్త్ర సీమా బల్‌లో ఖాళీగా ఉన్న 506 అసిస్టెంట్ కమాండెంట్ (గ్రూప్ -ఏ) ఉద్యోగాలను యూపీఎస్సీ భర్తీ చేయనుంది. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డిగ్రీ పాసైన పురుష, మహిళా అభ్యర్థులు అప్లయ్ చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు మే 14 వరకు గడువు విధించారు. దరఖాస్తు చేసుకోదలిచిన వారు పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.