iDreamPost
android-app
ios-app

డిగ్రీ పాసై ఖాళీగా ఉన్నారా? ఈ Bank ఉద్యోగాలకు ఇప్పుడే అప్లై చేసుకోండి.. మంచి జీతం

UCO bank recruitment 2024: మీరు డిగ్రీ ఉత్తీర్ణులై ఖాళీగా ఉన్నారా? బ్యాంక్ జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. యూకో బ్యాంక్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వెంటనే అప్లై చేసుకోండి.

UCO bank recruitment 2024: మీరు డిగ్రీ ఉత్తీర్ణులై ఖాళీగా ఉన్నారా? బ్యాంక్ జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. యూకో బ్యాంక్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వెంటనే అప్లై చేసుకోండి.

డిగ్రీ పాసై ఖాళీగా ఉన్నారా? ఈ Bank ఉద్యోగాలకు ఇప్పుడే అప్లై చేసుకోండి.. మంచి జీతం

డిగ్రీలు పూర్తి చేసిన యువత ప్రభుత్వ రంగాల్లో కొలువులు సాధించేందుకు ఇంట్రెస్టు చూపిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలే లక్ష్యంగా ఏళ్లకేళ్లుగా ప్రిపేర్ అవుతున్నారు. ఈ క్రమంలో బ్యాంకు జాబ్స్ కోసం సన్నద్ధమయ్యే వారికి గుడ్ న్యూస్. ఇటీవల భారీ స్థాయిలో బ్యాంకు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. బ్యాంకు జాబ్ లక్ష్యంగా పెట్టుకున్న వారికి ఇదే మంచి ఛాన్స్. మీరు డిగ్రీ పాసై ఖాళీగా ఉన్నట్లైతే ఈ బ్యాంక్ జాబ్స్ మీకోసమే. ఇటీవల యూకో బ్యాంక్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే మంచి వేతనం అందుకోవచ్చు.

యూకో బ్యాంక్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 544 పోస్టులను భర్తీ చేయనుంది. అభ్యర్థులు భారత ప్రభుత్వంచేత గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం / సంస్థల నుంచి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు 20-28 ఏళ్ల వయసు కలిగి ఉండాలి. అర్హత, ఆసక్తి ఉన్నవారు జులై 16వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 15 వేలు జీతం అందిస్తారు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం అప్రెంటిస్ పోస్టులు: 544

అర్హత:

  • అభ్యర్థులు భారత ప్రభుత్వంచేత గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం / సంస్థల నుంచి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:

  • అభ్యర్థులు 20-28 ఏళ్ల వయసు కలిగి ఉండాలి.

ఎంపిక విధానం:

  • ఆన్ లైన్ రాత పరీక్ష, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యూమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ అధారంగా ఎంపిక చేస్తారు.

జీతం:

  • అప్రెంటిస్ షిప్ కాలంలో అప్రెంటిస్ కు నెలకు రూ .15000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం:

  • ఆన్ లైన్

దరఖాస్తుకు చివరి తేదీ:

  • 16-07-2024