10th, ITI పాసైతే చాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే రైల్వేలో ఉద్యోగాలు

ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రాత పరీక్ష లేకుండానే రైల్వేలో ఉద్యోగాలు పొందే అవకాశం వచ్చింది. పదోతరగతి, ఐటీఐ పాసైతే చాలు జాబ్ వరించినట్టే.

ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రాత పరీక్ష లేకుండానే రైల్వేలో ఉద్యోగాలు పొందే అవకాశం వచ్చింది. పదోతరగతి, ఐటీఐ పాసైతే చాలు జాబ్ వరించినట్టే.

ప్రభుత్వ ఉద్యోగం సాధించడమంటే ఈ రోజుల్లో అంత సులభమేమీ కాదు. ఎందుకంటే ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కూడా లక్షలాది మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. గవర్నమెంట్ జాబ్స్ కు కాంపిటీషన్ ఓ రేంజ్ లో ఉంది. అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగం కోసం నెలలు, సంవత్సరాలు సన్నద్ధమవ్వాల్సి ఉంటుంది. రాత పరీక్షలు, ఇంటర్వ్యూలు ఎదుర్కొన్నాక అప్పుడు జాబ్ వరిస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో అసలు పరీక్ష రాయకుండానే రైల్వేలో ఉద్యోగం పొందే అవకాశం వచ్చింది. కేవలం మీరు పదోతరగతి, ఐటీఐ ఉత్తీర్ణులైతే చాలు ప్రభుత్వ ఉద్యోగాన్ని మీ సొంతం చేసుకోవచ్చు.

చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ భారతదేశ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న లోకోమోటివ్ వర్క్స్ కర్మాగారం. ఇది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉంది. కాగా ఇటీవల చిత్తరంజన్‌లోని చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ 2024-25 సంవత్సరానికి 492 యాక్ట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అప్రెంటిస్ వెబ్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో ఏప్రిల్ 18లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష లేదు. విద్యార్హతలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

  • యాక్ట్‌ అప్రెంటిస్ పోస్టుల సంఖ్య:
  • 492

ట్రేడుల వారీగా ఖాళీలు:

  • ఫిట్టర్- 200
  • టర్నర్- 20
  • మెషినిస్ట్- 56
  • వెల్డర్(జీ&ఈ)- 88
  • ఎలక్ట్రీషియన్- 112
  • రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ మెకానిక్స్- 04
  • పెయింటర్(జీ)- 12

అర్హత:

  • పదో తరగతి, సంబంధిత ట్రేడ్‌లలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:

  • 27.03.2024 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ లైన్

ఎంపిక విధానం:

  • విద్యార్హతలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

స్టైఫెండ్:

  • రైల్వే బోర్డ్ నిబంధనల ప్రకారం స్టైఫండ్ అందిస్తారు.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:

  • 18-04-2024.
Show comments