10th పాసైతే చాలు.. నేవీలో జాబ్.. మహిళలు కూడా అప్లై చేసుకోవచ్చు

మీరు ఇండియన్ నేవీలో ఉద్యోగం పొందాలని భావిస్తున్నారా? అయితే ఈ అవకాశాన్ని మాత్రం వదులుకోవద్దు. ఇండియన్ నేవీలో అగ్నివీర్(ఎంఆర్‌-మెట్రిక్ రిక్రూట్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.

మీరు ఇండియన్ నేవీలో ఉద్యోగం పొందాలని భావిస్తున్నారా? అయితే ఈ అవకాశాన్ని మాత్రం వదులుకోవద్దు. ఇండియన్ నేవీలో అగ్నివీర్(ఎంఆర్‌-మెట్రిక్ రిక్రూట్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.

యువత ఎక్కువ భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలో ఉద్యోగాలు సాధించాలని కలలుకంటుంటారు. దేశ సేవలో తమ వంతు సేవ చేయాలని భావిస్తుంటారు. ఈ క్రమంలో రక్షణ సంస్థల నుంచి నోటిఫికేషన్లు ఎప్పుడెప్పుడు విడుదలవుతాయా అని ఎదురుచూస్తుంటారు. ఈ ఉద్యోగాలను పొందితే సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది. మంచి వేతనాలను కూడా అందుకోవచ్చు. మరి మీరు కూడా ఇండియన్ నేవీలో చేరాలని అనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. భారత త్రివిధ దళాల్లో ఒకటైన ఇండియన్ నేవీ నిరుద్యోగులకు తీపికబురును అందించింది. పలు ఉద్యోగాల భర్తీకొరకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది.

మీరు పదోతరగతి పాసయ్యారా?.. అయితే ఇండియన్ నేవీలో జాబ్ పొందే ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. ఇండియన్ నేవీలో అగ్నివీర్(ఎంఆర్‌-మెట్రిక్ రిక్రూట్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అగ్నివీరులుగా ఎంపికైన అభ్యర్థులకు ఐఎన్‌ఎస్‌ చిల్కాలో (02/2024-నవంబర్‌ 24 బ్యాచ్‌) ట్రైనింగ్ ఉంటుంది. టెన్త్ క్లాస్ పాసైన అవివాహిత పురుష, మహిళ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ మే 13 నుంచి ప్రారంభం కానుంది. మే 27 వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించారు. దరఖాస్తు చేసుకోదలిచిన వారు పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

పోస్టులు:

  • అగ్నివీర్(మెట్రిక్‌ రిక్రూట్‌- ఎంఆర్‌)

అర్హత:

  • అభ్యర్థులు పదోతరగతి లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. నిర్ణీత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. పురుషులు 157 సెం.మీ., మహిళలు 152 సెం.మీ. ఉండాలి.

వయోపరిమితి:

  • 01.11.2003 – 30.04.2007 మధ్య జన్మించి ఉండాలి.

దరఖాస్తు ఫీజు:

  • రూ.550 చెల్లించాలి.

దరఖాస్తు విధానం:

  • ఆన్ లైన్

ఎంపిక విధానం:

  • షార్ట్‌లిస్టింగ్, కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష(సీబీఈ), రాత పరీక్ష, శారీరక దార్ఢ్య పరీక్ష(పీఎఫ్‌టీ), వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

శిక్షణ వివరాలు:

  • అగ్నివీర్‌లుగా ఎంపికైన అభ్యర్థులకు ఒడిశా రాష్ట్రంలోని ఐఎన్‌ఎస్‌ చిల్కాలో వచ్చే ఏడాది నవంబర్‌ నెలలో కోర్సు శిక్షణ ప్రారంభమవుతుంది.

జీతం:

  • ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది రూ.30,000, రెండో ఏడాది రూ.33,000, మూడో ఏడాది రూ.36,500, నాలుగో ఏడాది రూ.40,000 వేతనం అందిస్తారు.

దరఖాస్తు ప్రారంభ తేదీ:

  • 13-05-2024.

దరఖాస్తులకు చివరి తేదీ:

  • 27-05-2024.
Show comments