iDreamPost
android-app
ios-app

డిగ్రీ పాసైతే చాలు.. 9,995 Bank ఉద్యోగాలు.. ఇక వద్దన్నా జాబ్

  • Published Jun 07, 2024 | 1:20 PM Updated Updated Jun 07, 2024 | 1:20 PM

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. మీరు డిగ్రీ ఉత్తీర్ణులై బ్యాంక్ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నట్లైతే ఇదే మంచి అవకాశం. 9,995 బ్యాంకు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. మీరు డిగ్రీ ఉత్తీర్ణులై బ్యాంక్ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నట్లైతే ఇదే మంచి అవకాశం. 9,995 బ్యాంకు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి.

  • Published Jun 07, 2024 | 1:20 PMUpdated Jun 07, 2024 | 1:20 PM
డిగ్రీ పాసైతే చాలు.. 9,995 Bank ఉద్యోగాలు.. ఇక వద్దన్నా జాబ్

బ్యాంకు జాబ్స్ కు ఉండే క్రేజే వేరు. వేలాదిమంది యువత బ్యాంకు ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతుంటారు. లాంగ్ టర్మ్ కోచింగ్స్ తీసుకుంటూ ఉద్యోగం సాధించే వరకు సన్నద్ధమవుతుంటారు. బ్యాంకు ఉద్యోగమైతే.. ఆహ్లాదకరమైన వాతావరణంలో విధులు, మంచి జీతం, ముఖ్యంగా సెలవులు అధికంగా ఉండడంతో బ్యాంకు జాబ్స్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంటారు యూత్. మరి మీరు కూడా బ్యాంక్ జాబ్ కోరుకుంటున్నారా? మీరు డిగ్రీ ఉత్తీర్ణులై ఖాళీగా ఉన్నారా? అయితే ఈ గోల్డెన్ ఛాన్స్ ను అస్సలు వదలకండి. తాజాగా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ 9,995 బ్యాంకు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. వెంటనే అప్లై చేసుకోండి.

జాతీయ స్థాయిలో గ్రామీణ బ్యాంకుల్లో ఖాళీల భర్తీకి ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ-సీఆర్‌పీ నోటిఫికేషన్‌ను ఐబీపీఎస్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 9,995 గ్రూప్‌-ఎ ఆఫీస‌ర్ (స్కేల్‌-1, 2, 3), గ్రూప్‌-బి ఆఫీస్ అసిస్టెంట్(మ‌ల్టీ ప‌ర్పస్‌) పోస్టులను భర్తీ చేయనుంది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 1,149 పోస్టులు భర్తీకానున్నాయి. అభ్యర్థులు పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత, ఆసక్తి ఉన్న వారు జూన్ 27 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోదలిచిన వారు పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం పోస్టుల సంఖ్య:

  • 9,995

విభాగాల వారీగా ఖాళీలు:

  • ఆఫీస్ అసిస్టెంట్(మ‌ల్టీ ప‌ర్పస్‌): 5585
  • ఆఫీస‌ర్ (స్కేల్‌-1): 3499
  • ఆఫీస‌ర్ (స్కేల్‌-2): 782
  • ఆఫీస‌ర్ (స్కేల్‌-3): 129 పోస్టులు
  • తెలుగు రాష్ట్రాలకు కేటాయించిన పోస్టుల వివరాలు:
  • ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్): 570
  • ఆఫీసర్ స్కేల్-1: 525
  • ఆఫీసర్ స్కేల్-2: 46
  • ఆఫీసర్ స్కేల్-3: 08

అర్హతలు:

  • పోస్టులను అనుసరించి బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం. సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి.

వయోపరిమితి:

  • ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18-28 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • ఆఫీసర్ స్కేల్-I (అసిస్టెంట్ మేనేజర్) పోస్టులకు 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • ఆఫీసర్ స్కేల్-II (మేనేజర్) పోస్టులకు 21- 32 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • ఆఫీసర్ స్కేల్-III (సీనియర్ మేనేజర్) పోస్టులకు 21-40 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ లైన్

దరఖాస్తు ఫీజు:

  • అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.850 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.175 చెల్లించాలి.

ఎంపిక విధానం:

  • ప్రిలిమ్స్, మెయిన్ పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:

  • 07-06-2024

దరఖాస్తుకు చివరితేది:

  • 27-06-2024

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom