iDreamPost
android-app
ios-app

ఇంటర్ పాసైతే చాలు.. 3,712 ప్రభుత్వ ఉద్యోగాలు రెడీ..

ప్రభుత్వ ఉద్యోగం సాధించడం మీ లక్ష్యమా? ఎప్పటి నుంచోో గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇదే మంచి ఛాన్స్. 3712 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. దేశవ్యాప్తంగా పలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా ఏకంగా 3,712 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించిన సీహెచ్ఎస్ఎల్(10+2) నోటిఫికేషన్ ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు మే 07 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రకటించిన ఉద్యోగాల్లో లోయర్ డివిజన్ క్లర్క్/జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులున్నాయి.

ఇంటర్ ఉత్తీర్ణులైన వారు ఈ జాబ్స్ కు అర్హులు. ఆగస్టు 01 2024 నాటికి 18-27 ఏళ్ల వయసు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు పోటీపడొచ్చు. ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన టైర్ 1 పరీక్షలు జూన్, జూలైలో నిర్వహించనున్నారు అధికారులు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం ఎస్ఎస్సీ అధికారిక వెబ్ సైట్ https://ssc.gov.in/ ను పరిశీలించాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే పోస్టులను అనుసరించి నెలకు రూ. 19 వేల నుంచి 92 వేల వరకు జీతం అందిస్తారు.