iDreamPost

ఈ జాబ్స్ కొడితే లైఫ్ సెట్ అయిపోద్ది.. సింగరేణిలో ఉద్యోగాలు.. ఈ అర్హతలుండాలి!

నిరుద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్న సింగరేణిలో ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ రానే వచ్చింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ జాబ్స్ సాధించి జీవితంలో స్థిరపడిపోవచ్చు.

నిరుద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్న సింగరేణిలో ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ రానే వచ్చింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ జాబ్స్ సాధించి జీవితంలో స్థిరపడిపోవచ్చు.

ఈ జాబ్స్ కొడితే లైఫ్ సెట్ అయిపోద్ది.. సింగరేణిలో ఉద్యోగాలు.. ఈ అర్హతలుండాలి!

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి గుడ్ న్యూస్. రాష్ట్రంలో ఉద్యోగాల జాతర మొదలైంది. పలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ విడుదలవుతున్నాయి. ఇటీవల విద్యాశాఖలో 11062 పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. మరోవైపు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ కొనసాగుతోంది. కొన్ని రోజుల క్రితం సింగరేణిలో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మీరు గవర్నమెంట్ జాబ్ సాధించాలనే లక్ష్యం పెట్టుకుని ఉన్నట్లైతే ఇదే మంచి అవకాశం. ఈ జాబ్స్ కొడితే లైఫ్ సెట్ అయిపోద్ది.

సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న 272 ఎగ్జిక్యూటివ్, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. డైరెక్ట్ రిక్రూట్ మెంట్ పద్దతిలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ(ఇంజినీరింగ్‌), సీఏ/ఐసీడబ్ల్యూఏ/ సీఎంఏ, డిగ్రీ, పీజీ డిప్లొమా, ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీబీఎస్‌, డిప్లొమా పాసై ఉండాలి. మార్చి 01 నుంచి అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లై చేసుకోదలిచిన అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం సింగరేణి అధికారిక వెబ్ సైట్ https://scclmines.com/ ను పరిశీలించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం పోస్టుల సంఖ్య:

  • 272

ఖాళీల వివరాలు:

ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు:

  • మేనేజ్‌మెంట్‌ ట్రైనీ(మైనింగ్‌), ఈ2 గ్రేడ్‌-139, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ(ఎఫ్‌ అండ్‌ ఎ), ఈ2 గ్రేడ్‌-22, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ(పర్సనల్‌), ఈ2 గ్రేడ్‌-22, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ(ఐఈ), ఈ2 గ్రేడ్‌-10, జూనియర్‌ ఎస్టేట్స్‌ ఆఫీసర్, ఈ1 గ్రేడ్‌-10, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ(హైడ్రో-జియాలజిస్ట్‌), ఈ2 గ్రేడ్‌-02, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ(సివిల్‌), ఈ2 గ్రేడ్‌-18, జూనియర్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్, ఈ1 గ్రేడ్‌-03, జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్, ఈ3 గ్రేడ్‌-30 ఖాళీలున్నాయి.

నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు:

  • సబ్‌-ఓవర్సీర్‌ ట్రైనీ(సివిల్‌), టి-ఎస్‌ గ్రేడ్‌-సి-16.

అర్హత:

  • అభ్యర్థులు పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ(ఇంజినీరింగ్‌), సీఏ/ఐసీడబ్ల్యూఏ/ సీఎంఏ, డిగ్రీ, పీజీ డిప్లొమా, ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీబీఎస్‌, డిప్లొమా పాసై ఉండాలి.

వయసు:

  • అభ్యర్థుల వయసు కనిష్టంగా 18 ఏళ్లు నిండి ఉండి.. గరిష్టంగా 30 ఏళ్లు మించకూడదు. జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు (జీడీఎంవో) 45 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు వయోపరిమితిలో ఐదేళ్ల సడలింపు కల్పించారు.

ఎంపిక ప్రక్రియ:

  • అభ్యర్థులను రాత పరీక్ష, ధృవ పత్రాల ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ లైన్‌

దరఖాస్తులు ప్రారంభతేది:

  • 01-03-2024

దరఖాస్తులకు చివరితేది:

  • 18-03-2024

సింగరేణి అధికారిక వెబ్ సైట్:

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి