PNB SO Recruitment 2024: అప్లై చేయండి.. జాబ్ కొట్టండి.. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 1,025 ఉద్యోగాలు

అప్లై చేయండి.. జాబ్ కొట్టండి.. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 1,025 ఉద్యోగాలు

బ్యాంకు ఉద్యోగాల కోసం సన్నద్ధమయ్యే వారికి భారీ శుభవార్త. వంద, రెండొందలు కాదు ఏకంగా వెయ్యికి పైగా బ్యాంకు ఉద్యోగాలకు పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి నోటిఫికేషన్ వెలువడింది. నెలకు రూ. 78 వేల వరకు జీతం అందుకోవచ్చు.

బ్యాంకు ఉద్యోగాల కోసం సన్నద్ధమయ్యే వారికి భారీ శుభవార్త. వంద, రెండొందలు కాదు ఏకంగా వెయ్యికి పైగా బ్యాంకు ఉద్యోగాలకు పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి నోటిఫికేషన్ వెలువడింది. నెలకు రూ. 78 వేల వరకు జీతం అందుకోవచ్చు.

దేశంలో ఇటీవల రైల్వే, ఆర్మీ, నేవీ, బ్యాంకింగ్ సెక్టార్ ల నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. దీంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా పలు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతుండగానే తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ భారీ స్థాయిలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నది. దేశ వ్యాప్తంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసేందుకు పంజాబ్ నేషనల్ బ్యాంకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 1025 జాబ్స్ ను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 78 వేల వరకు జీతం అందుకోవచ్చు. అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న వారు ఫిబ్రవరి 25 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోదలచిన అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారిక బెబ్ సైట్ ను https://www.pnbindia.in/ పరిశీలించాల్సి ఉంటుంది. మరి ఈ ఉద్యోగాకు అర్హతలు ఏంటీ? వయోపరిమితి ఎంత? ఎంపిక ప్రక్రియ ఎలా? వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు:

  • 1025

విభాగాల వారీగా ఖాళీలు:

  • ఆఫీసర్-క్రెడిట్ (జేఎంజీ స్కేల్-I): 1000 పోస్టులు
  • మేనేజర్-ఫారెక్స్ (ఎంఎంజీ స్కేల్-II): 15 పోస్టులు
  • మేనేజర్-సైబర్ సెక్యూరిటీ (ఎంఎంజీ స్కేల్-II): 05 పోస్టులు
  • సీనియర్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ (ఎంఎంజీ స్కేల్-III): 05 పోస్టులు

విద్యార్హత:

  • పోస్టులను అనుసరించి అభ్యర్థులు బీఈ/ బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌, ఎంసీఏ, ఎంబీఏ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీజీఏ ఉత్తీర్ణులై ఉండాలి. దీంతో పాటు సంబంధిత రంగంలో పని అనుభవం ఉండాలి.

వయో పరిమితి:

  • 01.01.2024 నాటికి ఆఫీసర్ పోస్టులకు 21-28 ఏళ్లు, మేనేజర్‌ పోస్టులకు 25-35 ఏళ్లు, సీనియర్ మేనేజర్ పోస్టులకు 27-38 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతం:

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు ఆఫీసర్‌కు రూ.36,000-రూ.63,840, మేనేజర్‌కు రూ.48,170-రూ.69,810, సీనియర్ మేనేజర్‌కు రూ.63,840-రూ.78,230 అందిస్తారు.

ఎంపిక ప్రక్రియ:

  • ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు:

  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.59 చెల్లిస్తే సరిపోతుంది. మిగతా అభ్యర్థులు రూ.1180 చెల్లించాలి.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ లైన్‌

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం:

  • 07-02-2024

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ:

  • 25-02-2024

పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారిక బెబ్ సైట్:

Show comments