iDreamPost
android-app
ios-app

లైఫ్ సెట్ అయ్యే జాబ్స్.. నెలకు లక్ష జీతం.. ఈ అర్హతలుంటే చాలు

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి ఇదే మంచి అవకాశం. నెలకు లక్ష జీతంతో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి ఇదే మంచి అవకాశం. నెలకు లక్ష జీతంతో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి.

లైఫ్ సెట్ అయ్యే జాబ్స్.. నెలకు లక్ష జీతం.. ఈ అర్హతలుంటే చాలు

ప్రస్తుత రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలకు ఫుల్ కాంపిటిషన్ నెలకొన్నది. ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా సరే లక్షలాది మంది నిరుద్యోగులు పోటీపడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు మొదట్లో జీతాలు తక్కువగానే ఉన్నప్పటికీ సర్వీస్ పెరుగుతున్నాకొద్ది ఇంక్రిమెంట్స్ ఇతర సౌకర్యాలు ప్రభుత్వాలు కల్పిస్తాయి. అందుకే యువత ఏళ్లకేళ్లు గవర్నమెంట్ జాబ్స్ కోసం సన్నద్ధమవుతుంటారు. మరి మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నట్లైతే ఇదే మంచి అవకాశం. కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలను సాధిస్తే జీవితంలో స్థిరపడిపోవచ్చు.

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ఢిల్లీలోని సెంట్రల్ మెడికల్ సర్వీసెస్ సొసైటీ.. కాంట్రాక్ట్​ ప్రాతిపదికన పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 15 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు మే 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు లక్ష రూపాయలు అందుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు పోస్టులను అనుసరించి డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, సీఏ, ఐసీడబ్య్లూఏ ఉత్తీర్ణతతో పాటుగా పని అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తు చేసుకోదలిచిన వారు పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

పోస్టుల వివరాలు:

  • అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ప్రొక్యూర్ మెంట్)- 02
  • అసిస్టెంట్ జనరల్ మేనేజర్(క్వాలిటీ అస్యూరెన్స్)-01
  • అసిస్టెంట్ జనరల్ మేనేజర్(లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ విభాగం)-01
  • అసిస్టెంట్ జనరల్ మేనేజర్(ఫైనాన్స్)-01
  • మేనేజర్(ప్రొక్యూర్ మెంట్)-02
  • మేనేజర్((లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్)-02
  • మేనేజర్ (ఫైనాన్స్)-02
  • మేనేజర్ (క్వాలిటీ అస్యూరెన్స్)-02
  • వేర్ హౌస్ మేనేజర్(ఫార్మాసిస్ట్)-02
  • ఆఫీస్ అసిస్టెంట్-01

అర్హతలు:

  • పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, సీఏ, ఐసీడబ్య్లూఏ ఉత్తీర్ణతతో పాటుగా పని అనుభవం కూడా ఉండాలి.

వయోపరిమితి :

  • అన్ని విభాగాల్లోని జనరల్ మేనేజర్, వేర్ హౌస్ మేనేజర్ పోస్టులకు 45 ఏళ్లు ఉండాలి. అలాగే.. అన్ని విభాగాల్లోని మేనేజర్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి అభ్యర్థుల వయస్సు 40 ఏళ్లు మించకూడదు.

జీతం :

  • జనరల్ మేనేజర్ పోస్టులకు నెలకు జీతం రూ.1,00,000 ఉంటుంది. మేనేజర్ వేర్ హౌస్ మేనేజర్ పోస్టులకు నెల జీతం రూ.50,000 ఉండగా.. ఆఫీస్ అసిస్ట్ంట్ పోస్టుకు నెలవారి జీతం రూ.30వేలు ఉంటుంది.

దరఖాస్తు విధానం:

  • ఆఫ్ లైన్

దరఖాస్తు పంపాల్సిన అడ్రస్ :

  • ది జనరల్ మేనేజర్(అడ్మినిస్టేషన్), సెంట్రల్ మెడికల్ సర్వీసెస్ సొసైటీ, సెకండ్ ఫ్లోర్, విశ్వ యువక్ కేంద్ర, టీన్ మూర్తీ మార్గ్, ఛాణక్యపురి, న్యూఢిల్లీ-11002

దరఖాస్తుకు చివరి తేదీ:

  • 20-05-2024

Jojobet Girişgrandpashabetcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabettarafbetjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabet