10th అర్హతతో 30 వేల పోస్టాఫీస్ జాబ్స్!.. మంచి జీతం.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక

India Post GDS Recruitment 2024: నిరుద్యోగులకు తీపి కబురు అందించేందుకు పోస్టల్ డిపార్ట్ మెంట్ రెడీ అవుతోంది. ఏకంగా 30 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. టెన్త్ అర్హతతో ఈ ఉద్యోగాలకు పోటీ పడొచ్చు.

India Post GDS Recruitment 2024: నిరుద్యోగులకు తీపి కబురు అందించేందుకు పోస్టల్ డిపార్ట్ మెంట్ రెడీ అవుతోంది. ఏకంగా 30 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. టెన్త్ అర్హతతో ఈ ఉద్యోగాలకు పోటీ పడొచ్చు.

పదో తరగతి వరకు చదివిన తర్వాత కొంత మంది ఉన్నత విద్యను అభ్యసిస్తుంటారు. మరికొంత మంది ఆర్థిక స్థోమత సరిగా లేక చదువును ఆపేస్తుంటారు. ఇలాంటి వారు టెన్త్ అర్హతతో ఏదైనా జాబ్ ఉంటే బాగుండు అని ఆలోచిస్తుంటారు. ప్రైవేట్ రంగాల్లో పదో తరగతి అర్హతతో తక్కువ జాబ్స్ ఉంటాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నప్పటికీ కాంపిటీషన్ ఎక్కువ. ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ వచ్చిన లక్షలాది మంది పోటీపడుతున్నారు. ఇలాంటి తరుణంలో నిరుద్యోగులకు పోస్టల్ శాఖ గుడ్ న్యూస్ అందించింది. వందలు కాదు ఏకంగా 30 వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రెడీ అవుతోంది.

పోస్టల్ డిపార్ట్ మెంట్ నుంచి భారీ జాబ్ నోటిఫికేషన్ రాబోతోంది. పదో తరగతి పాసైన వారికి ఇది లక్కీ ఛాన్స్. వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో భారీ సంఖ్యలో గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నది. గతేడాది 40 వేల ఉద్యోగాల భర్తీకి పోస్టల్ శాఖ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ ఏడాది కూడా 30 వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. త్వరలోనే నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నది. ఈ ఉద్యోగాలకు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులను ఎలాంటి రాత పరీక్ష లేకుండానే పోస్టాఫీస్ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

టెన్త్ లో సాధించిన మార్కుల ఆధారంగానే ఈ నియామకాలు జరుగుతాయి. అభ్యర్థుల వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు వయోపరిమితి సడలింపు ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైనవారు బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌, అసిస్టెంట్‌బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌, డాక్‌ సేవక్‌ హోదాల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే పోస్టును బట్టి రూ. 10 వేల నుంచి రూ. 12 వేల వరకు ప్రారంభ వేతనం ఉంటుంది. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. త్వరలోనే ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ను పోస్టల్ డిపార్ట్ మెంట్ రిలీజ్ చేయనున్నది.

Show comments