iDreamPost
android-app
ios-app

స్పోర్ట్స్ ఆడేవారికి బెస్ట్ జాబ్స్.. వెస్ట్రన్ రైల్వేలో స్పోర్ట్స్ కోటాలో జాబ్స్.. ఈ అర్హతలుండాలి

  • Published Aug 20, 2024 | 2:10 PM Updated Updated Aug 20, 2024 | 2:10 PM

RRC WR Sports Quota Recruitment 2024: మీరు స్పోర్ట్స్ బాగా ఆడుతారా? అయితే రైల్వేలో బెస్ట్ జాబ్స్ మీకోసమే. వెస్ట్రన్ రైల్వేలో స్పోర్ట్స్ కోటాలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

RRC WR Sports Quota Recruitment 2024: మీరు స్పోర్ట్స్ బాగా ఆడుతారా? అయితే రైల్వేలో బెస్ట్ జాబ్స్ మీకోసమే. వెస్ట్రన్ రైల్వేలో స్పోర్ట్స్ కోటాలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

  • Published Aug 20, 2024 | 2:10 PMUpdated Aug 20, 2024 | 2:10 PM
స్పోర్ట్స్ ఆడేవారికి బెస్ట్ జాబ్స్.. వెస్ట్రన్ రైల్వేలో స్పోర్ట్స్ కోటాలో జాబ్స్.. ఈ అర్హతలుండాలి

రైల్వే జాబ్స్ కోసం ఎదురుచూసే వారికి గుడ్ న్యూస్. రైల్వే డిపార్ట్ మెంట్ నుంచి ఇటీవల భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగాలే లక్ష్యంగా పెట్టుకున్న వారు ఈ అవకాశాన్ని వదులుకోకండి. ఇటీవల వెస్ట్రన్ రైల్వే స్పోర్ట్స్ కోటాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే మంచి జీతం అందుకోవచ్చు. స్పోర్ట్స్ బాగా ఆడే మహిళా, పురుష అభ్యర్థులకు గోల్డెన్ ఛాన్స్. మరి ఈ పోస్టులకు అర్హతలు ఏంటి? వయోపరిమితి ఎంత? ఎంపిక ఎలా చేస్తారు? ఆ వివరాల్లోకి వెళ్తే..

రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్, వెస్ట్రన్ రైల్వే 2024-25 సంవత్సరానికి సంబంధించి స్పోర్ట్స్ కోటాలో గ్రూప్ సీ/ గ్రూప్ డీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 64 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులను అనుసరించి టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. అర్హత, ఆసక్తి ఉన్న పురుష, మహిళా క్రీడాకారులు సెప్టెంబర్‌ 14వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం ఖాళీలు : 64
లెవెల్‌-4/5 పోస్టులు: 5
లెవెల్‌-2/3 పోస్టులు: 16
లెవెల్‌-1 పోస్టులు: 43

అర్హత:

  • లెవెల్‌-4/5 పోస్టులకు ఏదైనా డిగ్రీ.. లెవెల్‌-2/3 పోస్టులకు ఐటీఐ, 12వ తరగతి.. లెవెల్‌-1 పోస్టులకు పదో తరగతి, ఐటీఐ/ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు క్రీడాంశాల్లో వివిధ స్థాయిల్లో విజయాలు సాధించి ఉండాలి.

క్రీడాంశాలు:

  • బాస్కెట్‌బాల్, క్రికెట్, రెజ్లింగ్, కబడ్డీ, టేబుల్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్, అథ్లెటిక్స్, బాడీ బిల్డింగ్, సైక్లింగ్, హాకీ, ఖో-ఖో, పవర్ లిఫ్టింగ్, స్విమ్మింగ్ తదితర క్రీడల్లో విజయాలు సాధించి ఉండాలి.

వయోపరిమితి:

  • 01/01/2025 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం:

  • విద్యార్హత, క్రీడా విజయాలు, గేమ్ స్కిల్, ఫిజికల్ ఫిట్‌నెస్, ట్రయల్స్‌ సమయంలో కోచ్ పరిశీలించే అంశాలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు:

  • రూ.500. ఎస్సీ/ ఎస్టీ/ ఈఎస్‌ఎం/ దివ్యాంగులు/ మహిళలు/ మైనారిటీలు/ ఈబీసీ అభ్యర్థులకు రూ.250 చెల్లించాలి.

దరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్‌

దరఖాస్తులు ప్రారంభ తేదీ:

  • 16-08-2024

దరఖాస్తులకు చివరి తేదీ:

  • 14-09-2024

Jojobet GirişjojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet girişjojobet giriş