P Venkatesh
RRB Technician Recruitment 2024: మీరు రైల్వే జాబ్స్ కోసం సన్నద్ధమవుతున్నారా? రైల్వేలో జాబ్ సాధించడం మీ కలనా? అయితే ఈ అవకాశాన్ని వదులుకోకండి
RRB Technician Recruitment 2024: మీరు రైల్వే జాబ్స్ కోసం సన్నద్ధమవుతున్నారా? రైల్వేలో జాబ్ సాధించడం మీ కలనా? అయితే ఈ అవకాశాన్ని వదులుకోకండి
P Venkatesh
భారతీయ రైల్వే శాఖ నుంచి ఇటీవల భారీ సంఖ్యలో జాబ్స్ భర్తీ కోసం నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు, అప్రెంటిస్ పోస్టులు, టెక్నీషియన్ పోస్టులను భారీగా సంఖ్యలో భర్తీ చేస్తున్నారు. తాజాగా రైల్వే శాఖ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న 14,298 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అయితే గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లో 9,144 ఖాళీలు ఉండగా ఇప్పుడు మరిన్ని పోస్టులను పెంచి మొత్తం 14,298 పోస్టులను భర్తీ చేయనున్నది రైల్వే శాఖ. రైల్వే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వారికి ఇది మళ్లీరాని అవకాశం. ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరంటే?
ఆర్ఆర్బీ జోన్ల వారీగా 14,298 టెక్నీషియన్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నది. ఇందులో సికింద్రాబాద్ రైల్వే జోన్‌లో 959 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు త్వరలో ప్రాధామ్యాల నమోదుకు అవకాశం కల్పించనున్నట్లు ఆర్ఆర్బీ స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన సమాచారం కోసం అభ్యర్థులు ఆర్ఆర్బీ అధికారిక వెబ్ సైట్ ను పరీశీలిస్తూ ఉండాలని సూచించింది. అభ్యర్థులు టెన్త్ తో పాటు సంబంధింత ట్రేడుల్లో ఐటీఐ పాసై ఉండాలి. ఈ పోస్టులకు సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నెలకు టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు రూ.29,200. టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు రూ.19,900 ప్రారంభ వేతనం ఉంటుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.