ఐటీబీపీలో కానిస్టేబుల్ జాబ్స్.. నెలకు 69 వేల జీతం.. మిస్ చేసుకోకండి

ITBP Recruitment 2024: గవర్నమెంట్ జాబ్ మీ లక్ష్యమా? అయితే ఈ జాబ్స్ ను అస్సలు వదలకండి. ఐటీబీలో 819 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి.

ITBP Recruitment 2024: గవర్నమెంట్ జాబ్ మీ లక్ష్యమా? అయితే ఈ జాబ్స్ ను అస్సలు వదలకండి. ఐటీబీలో 819 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి.

మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నట్లైతే ఈ అవకాశాన్ని వదులుకోకండి. నెక్ట్స్ ఏంటీ అని అడిగే వాళ్లకు ఈ జాబ్ కొట్టి సమాధానం చెప్పండి. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. నాన్ గెజిటెడ్(నాన్ మినిస్టీరియల్) గ్రూప్ సీ విభాగంలో కానిస్టేబుల్ (కిచెన్ సర్వీసెస్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 1 వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. మహిళలు, పురుషులు ఈ జాబ్స్ కోసం పోటీపడొచ్చు. డిగ్రీ కూడా అవసరం లేదు.

ఐటీబీటీ ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 819 పోస్టులను భర్తీ చేయనున్నది. అభ్యర్థులు టెన్త్ ఉత్తీర్ణతతో పాటుగా కిచెన్ కోర్స్ ఉత్తీర్ణులై ఉండాలి. నిర్ధిష్ట శారీరక ప్రమాణాలను కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్, ధృవ పత్రాల పరీశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు ఎంపికైతే నెలకు రూ. 21,700-69,100 చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ. 100 చెల్లించాలి. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం పోస్టులు: 819

అర్హత:

  • అభ్యర్థులు టెన్త్ ఉత్తీర్ణతతో పాటుగా కిచెన్ కోర్స్ ఉత్తీర్ణులై ఉండాలి. నిర్ధిష్ట శారీరక ప్రమాణాలను కలిగి ఉండాలి.

వయోపరిమితి:

  • అభ్యర్థుల వయసు 18-25 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక:

  • ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్, ధృవ పత్రాల పరీశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతం:

  • ఈ పోస్టులకు ఎంపికైతే నెలకు రూ. 21,700-69,100 చెల్లిస్తారు.

దరఖాస్తు ఫీజు:

  • రూ. 100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళలకు ఫీజు నుంచి మినహాయింపునిచ్చారు.

దరఖాస్తు విధానం:

  • ఆన్ లైన్

దరఖాస్తు ప్రారంభ తేదీ:

  • 02-09-2024

దరఖాస్తులకు చివరి తేదీ:

  • 01-10-2024
Show comments