iDreamPost
android-app
ios-app

IOCL Recruitment 2024: ఈ జాబ్స్ కొడితే లైఫ్ సెట్.. నెలకు 78 వేల జీతం.. అర్హులు వీరే

  • Published Aug 10, 2024 | 4:19 PM Updated Updated Aug 10, 2024 | 4:33 PM

IOCL Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో పలు జాబ్స్ భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి. మరికొన్ని రోజులే ఛాన్స్ ఉంది.

IOCL Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో పలు జాబ్స్ భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి. మరికొన్ని రోజులే ఛాన్స్ ఉంది.

  • Published Aug 10, 2024 | 4:19 PMUpdated Aug 10, 2024 | 4:33 PM
IOCL Recruitment 2024: ఈ జాబ్స్ కొడితే లైఫ్ సెట్.. నెలకు 78 వేల జీతం.. అర్హులు వీరే

ప్రభుత్వ ఉద్యోగం సాధించడం మీ లక్ష్యమా? జాబ్స్ కోసం సెర్చ్ చేసి విసిగిపోయారా? గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 78 వేల జీతం పొందొచ్చు. ఈ జాబ్స్ కొడితే లైఫ్ సెట్ అయిపోతుంది. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ నాన్ ఎగ్జిక్యూటీవ్ పర్సనల్ జాబ్స్ భర్తీ చేయనున్నది. మరి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు కావాల్సిన అర్హతలు ఏంటి? వయోపరిమితి ఎంత? ఎలా ఎంపిక చేస్తారు? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఐఓసీఎల్ నిరుద్యోగులకు శుభవార్తను అందించింది. 88 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. పోస్టులను అనుసరించి అభ్యర్థులు ఇంజినీరింగ్ డిప్లొమా, ఐటీఐ, బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు ఇంజినీరింగ్ అసిస్టెంట్, జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.25,000 నుంచి రూ.1,05,000 వరకు జీతం ఉంటుంది. అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ నిర్వహించి, మెరిట్ సాధించిన వారిని ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. టెక్నికల్ అటెండెంట్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.23,000 నుంచి రూ.78,000 జీతం ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న వారు ఆగస్టు 21 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

  • మొత్తం పోస్టులు – 88
  • ఇంజినీరింగ్ అసిస్టెంట్ – 38
  • టెక్నికల్ అటెండెంట్ – 29
  • జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్ – 21

అర్హత:

  • పోస్టులను అనుసరించి అభ్యర్థులు ఇంజినీరింగ్ డిప్లొమా, ఐటీఐ, బీఎస్సీ పాసై ఉండాలి.

వయోపరిమితి:

  • అభ్యర్థుల వయస్సు 2024 జులై 31 నాటికి 18 ఏళ్ల నుంచి 26 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఆయా కేటగిరీవర్గాల వారికి వయోసడలింపు నిబంధనలు వర్తిస్తాయి.

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు రూ.300 చెల్లించాలి. దివ్యాంగులు, ఎస్టీలు, ఎస్సీలకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపునిచ్చారు.

ఎంపిక ప్రక్రియ :

  • అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ నిర్వహించి, మెరిట్ సాధించిన వారిని ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

జీతం :

  • ఇంజినీరింగ్ అసిస్టెంట్, జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.25,000 నుంచి రూ.1,05,000 వరకు జీతం ఉంటుంది. టెక్నికల్ అటెండెంట్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.23,000 నుంచి రూ.78,000 జీతం ఉంటుంది.

దరఖాస్తు విధానం:

  • ఆన్ లైన్

ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ :

  • 22-07-2024

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :

  • 21-08-2024

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss