Dharani
Kadapa Student-Job At Amazon: కడప యువతి తన ప్రతిభతో అద్భుత విజయాన్ని సాధించింది. ఏడాదికి ఏకంగా 1.7 కోట్ల రూపాయల ప్యాకేజీతో ఉద్యోగం సాధించింది. ఆ వివరాలు..
Kadapa Student-Job At Amazon: కడప యువతి తన ప్రతిభతో అద్భుత విజయాన్ని సాధించింది. ఏడాదికి ఏకంగా 1.7 కోట్ల రూపాయల ప్యాకేజీతో ఉద్యోగం సాధించింది. ఆ వివరాలు..
Dharani
ఆడపిల్లకు చదువు ఎందుకనుకునే వారు నేటికి కూడా మన సమజాంలో కోకొల్లలు. చదువు దాకా ఎందుకు అమ్మాయి పుడితే భారం అనుకునే మూర్ఖులు ఈ కాలంలో కూడా ఉన్నారు. చదువు, ఆటలు ఇలా అన్ని రంగాల్లో రాణిస్తున్నా.. ఆడపిల్ల అంటే నేటికి చిన్న చూపే. కానీ వారి ప్రతిభను గుర్తించి.. కాస్త తోడ్పాటు అందిస్తే చాటు.. ఆడపిల్లలు అన్ని రంగాల్లో అద్భుతంగా రాణిస్తారు. అబ్బాయిలకు ధీటుగా విజయాలు అందుకుంటారు. ఇందుకు నిదర్శనంగా నిలిచే సంఘటనలు ఇప్పటికే అనేకం చూశాం. ఇక తాజాగా మరో యువతి ఈ జాబితాలో చేరింది. చదువుల తల్లిగా గుర్తింపు తెచ్చుకోవడమే కాక.. ఇప్పుడు ఏకంగా ఏడాదికి 1.70 కోట్ల రూపాయల వేతనంతో ఉద్యోగం సాధించి.. ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. ఆ వివరాలు..
ఆంధ్రప్రదేశ్‌లోని కడపకు చెందిన యువతి ఈ అరుదైన విజయం సాధించింది. ఆమె సక్సెస్ పట్ల ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆ యువతి తల్లిదండ్రలు సంతోషానికి అవధులే లేవు. యువతి విషయానికి వస్తే.. తనే కడప నగరానికి చెందిన ఎర్రనాగుల అమృతవల్లి. ఆమెది ఓ మధ్యతరగతి కుటుంబం. విజయవాడలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. ఐఐటీ జేఈఈ పరీక్షలో ప్రతిభ చూపినప్పటికీ చాలా తక్కువ మార్కుల తేడాతో సీటు రాలేదు. అయినా నిరాశ చెందక ఎన్ఐటీ దుర్గాపూర్‌లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో చేరింది. అక్కడే బీటెక్ పూర్తి చేసిన అమృతవల్లి.. ఆ తర్వత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లింది.
యూనివర్శిటీ ఆఫ్ ఫ్లోరిడాలో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్‌లో ఎంఎస్ పూర్తి చేసింది అమృతవల్లి. డిగ్రీ చేతికొచ్చిన ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే నెల రోజుల్లోనే ప్రముఖ సంస్థ అయిన అమెజాన్‌లో కొలువు దక్కించుకుంది. వాషింగ్టన్‌లోని సియాటెల్‌లో అమెజాన్ కేంద్ర కార్యాలయంలో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్‌గా ఏడాదికి రూ.1.70 కోట్ల వార్షిక వేతనంతో జాబ్ సాధించింది అమృతవల్లి. చదువు పూర్తైన నెల రోజుల వ్యవధిలోనే ఇంత పెద్ద కంపెనీలో.. ఇంత భారీ ప్యాకేజ్ తో ఉద్యోగం సాధించిన అమృతవల్లిని ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు.
ఇక తమ కుమార్తెకు భారీ ప్యాకెజీతో ఉద్యోగం రావడంపై అమృతవల్లి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలిసి ఉపాధ్యాయులు, బంధువులు అభినందనలు తెలియజేశారు. చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండేదని, ఆమె ప్రతిభకు మంచి ప్రతిఫలం దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. అమృతవల్లి సాధించిన విజయం ఎందరికో ఆదర్శం అంటున్నారు.