iDreamPost
android-app
ios-app

10, ఇంటర్‌ పాస్‌ అయ్యారా.. Jio బంపరాఫర్‌.. 30 వేల ఉద్యోగాలు భర్తీ

  • Published Jul 05, 2024 | 3:08 PM Updated Updated Jul 05, 2024 | 3:08 PM

పదో తరగతి, ఇంటర్‌ పాస్‌ అయ్యి ఉద్యోగాల కోసం చూస్తున్నారా.. అయితే జియో మీకో శుభవార్త చెప్పడానికి రెడీ అయ్యింది. సుమారు 30 వేల పోస్టుల భర్తీకి రెడీ అవుతోంది. ఆ వివరాలు..

పదో తరగతి, ఇంటర్‌ పాస్‌ అయ్యి ఉద్యోగాల కోసం చూస్తున్నారా.. అయితే జియో మీకో శుభవార్త చెప్పడానికి రెడీ అయ్యింది. సుమారు 30 వేల పోస్టుల భర్తీకి రెడీ అవుతోంది. ఆ వివరాలు..

  • Published Jul 05, 2024 | 3:08 PMUpdated Jul 05, 2024 | 3:08 PM
10, ఇంటర్‌ పాస్‌ అయ్యారా.. Jio బంపరాఫర్‌.. 30 వేల ఉద్యోగాలు భర్తీ

టెలికాం రంగంలో జియో సంచలనాలకు అడ్డగా మారింది. అంబానీ రాకతో.. అప్పటి వరకు దూసుకుపోతున్న మిగతా టెలికాం కంపెనీలు దెబ్బకు నేలకు చేరాయి. ఇక జియో పోటీ తట్టుకోవడానికి అవి కూడా రీఛార్జ్‌ ప్లాన్స్‌ ధర తగ్గించాయి. అయితే 2024, జూలై నెల నుంచి జియో సహా మిగతా టెలికాం కంపెనీలు.. రీఛార్జ్‌ ప్లాన్స్‌ ధరలను పెంచిన సంగతి తెలిసిందే. పెరిగిన రేట్లు జూలై 4 నుంచే అమల్లోకి వస్తున్నాయి. ఆ సంగతి అలా ఉంచితే.. జియో నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. 30 వేల ఉద్యోగాల భర్తీకి రెడీ అవుతోంది. 10, ఇంటర్‌ పాసైన వారికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రెడీ అవుతోంది. దీనిలో వర్క్‌ ఫ్రం హోం జాబ్‌లు కూడా ఉండటం విశేషం. ఆ వివరాలు..

పదో తరగతి, ఇంటర్‌ పాసై.. జాబ్‌ కోసం చూస్తున్నారా.. అయితే మీకు జియో భారీ బంపరాఫర్‌ ప్రకటిస్తుంది. వివిధ విభాగాలలో దాదాపుగా 30 వేల వరకు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రెడీ అవుతోంది జియో. డిగ్రీ, పిజీతో పాటు పదో తరగతి, ఇంటర్‌ పాసైన వారికి కూడా ఉద్యోగాలు కల్పించనుంది. అంతేకాక వర్క్‌ ఫ్రం హోం, పార్ట్‌ టైమ్‌ జాబ్‌ కావాలనుకునే వారు కూడా అప్లై చేసుకోవచ్చు అని తెలిపింది. ఈ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న వారు.. వారి క్వాలిఫికేషన్‌కు తగ్గ పోస్టులకు అప్లై చేసుకోవాలని సూచించింది.

ఇందుకోసం జియో అధికారిక వెబ్సైట్‌లో మీ వివరాలన్నీ నమోదు చేయాలి. ఆ తర్వాత కంపెనీవారు అప్లై చేసిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి కాల్, మెయిల్ ద్వారా సంప్రదించి.. ఇంటర్వ్యూ నిర్వహించి.. ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫుల్ టైం, పార్ట్ టైం ఉద్యోగాలతో పాటు ఫ్రీలాన్సర్‌ ఉద్యోగాలను కూడా భర్తీ చేసేందుకు జియో రెడీ అవుతోంది.

ఏ ఏ విభాగాల్లో భర్తీ చేయనున్నారంటే..

సేల్స్ అండ్‌ డిస్ట్రిబ్యూషన్, బిజినెస్ ఆపరేషన్స్ , ఇంజనీరింగ్ అండ్‌ టెక్నాలజీ, అప్రెంటిస్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్, హోమ్‌ రిసోర్సెస్అం డ్‌ ట్రైనింగ్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, కార్పొరేట్ ఎఫైర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెగ్యులేటరీ, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కాంట్రాక్ట్స్, ఆపరేషన్స్, సప్లై చైన్ కార్పొరేట్ సర్వీసెస్, లీగల్ మార్కెటింగ్‌తో పాటు ఇతర విభాగాల్లో సుమారు 30 వేల వరకు ఖాళీలను భర్తీ చేయనున్నారు.

గమనిక: ఈ పోస్టులకు అప్లై చేయడానికి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు.

అర్హతలు:

10th, ఇంటర్మీడియట్, డిగ్రీ డిప్లమా, బిటెక్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్

పోస్టింగ్ లొకేషన్:

మీ సొంత జిల్లాలోనే ఉద్యోగం పొందే అవకాశం ఉంది.

కనీస వయస్సు:

కనీసం 18 సంవత్సరాలు నిండిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు.

చివరి తేదీ:

ఇంకా పేర్కొనలేదు కాబట్టి వెంటనే అప్లై చేసుకుంటే మంచిది అంటున్నారు

ఎంపిక విధానం..

అప్లై చేసిన ఉద్యోగాన్ని బట్టి పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి అధికారిక వెబ్సైట్ లో ఆన్లైన్ లో మీకు సంబంధించిన అన్ని వివరాలు సరిగ్గా నమోదు చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఎలా అప్లై చేయాలంటే..

పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు పైన ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి అధికారిక వెబ్సైట్‌లో​కి వెళ్లి.. ఆన్‌లైన్‌లో మీకు సంబంధించిన వివరాలు సరిగ్గా నమోదు చేయాలి. ఆ తర్వాత సబ్మిట్‌ చేయాలి. అనంతరం కంపెనీ నుంచి మీకు కాల్‌, మెయిల్‌ వస్తుంది.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetJojobet GirişHoliganbetHoliganbet Giriş