iDreamPost
android-app
ios-app

ఇండియన్ బ్యాంకులో 300 జాబ్స్.. నెలకు 85 వేల జీతం.. ఇంకా కొన్ని రోజులే ఛాన్స్

  • Published Aug 27, 2024 | 7:07 PM Updated Updated Aug 27, 2024 | 7:07 PM

Local Bank Officer Recruitment 2024: మీరు బ్యాంక్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్నట్లైతే ఈ అవకాశాన్ని వదులుకోకండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే 85 వేల జీతం అందుకోవచ్చు.

Local Bank Officer Recruitment 2024: మీరు బ్యాంక్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్నట్లైతే ఈ అవకాశాన్ని వదులుకోకండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే 85 వేల జీతం అందుకోవచ్చు.

  • Published Aug 27, 2024 | 7:07 PMUpdated Aug 27, 2024 | 7:07 PM
ఇండియన్ బ్యాంకులో 300 జాబ్స్.. నెలకు 85 వేల జీతం.. ఇంకా కొన్ని రోజులే ఛాన్స్

డిగ్రీలు, పీజీలు పూర్తి చేసి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో జాబ్స్ కోసం ప్రయత్నిస్తుంటారు. జాబ్ ఉంటే బాగుండు అని ఆలోచిస్తుంటారు. ఇలాంటి వారికి గుడ్ న్యూస్. ప్రముఖ బ్యాంక్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మీరు బ్యాంక్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారా? ఏళ్ల తరబడి ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారా? అయితే ఈ బ్యాంక్ జాబ్స్ ను వదులుకోకండి. డిగ్రీతోనే ఈ ఉద్యోగాలను పొందొచ్చు. డిగ్రీ పాసై ఖాళీగా ఉన్నవారు ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి. ఈ పోస్టులకు మరికొన్ని రోజుల్లో దరఖాస్తు ప్రక్రియ ముగియనున్నది. వెంటనే అప్లై చేసుకోండి.

ఇండియన్ బ్యాంక్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకోం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 300 పోస్టులను భర్తీ చేయనున్నారు. అందులో ఏపీ, తెలంగాణలో 50 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ బ్యాంక్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్ట్‌లకు ఎంపికయ్యే అభ్యర్థులకు జీతం నెలకు రూ.48,480- 85,920 వరకు లభిస్తుంది. 2024 జులై 1 నాటికి 20-30 ఏళ్ల మధ్య వయసు ఉన్న అభ్యర్థులు అర్హులు. అర్హత, ఆసక్తి ఉన్నవారు సెప్టెంబర్ 02 వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం పోస్టులు: 300

అర్హత:

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసిన వారు అర్హులు.

వయోపరిమితి:

  • 2024 జులై 1 నాటికి 20-30 ఏళ్ల మధ్య వయసు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆయా కేటగిరీ వర్గాల వారికి వయో సడలింపు నిబంధనలు వర్తిస్తాయి.

ఎంపిక విధానం:

  • రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.

జీతం:

  • ఇండియన్ బ్యాంక్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్ట్‌లకు ఎంపికయ్యే అభ్యర్థులకు జీతం నెలకు రూ.48,480- 85,920 వరకు లభిస్తుంది.

అప్లికేషన్ ఫీజు:

  • జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు రూ.1000 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.175 చెల్లిస్తే చాలు.

దరఖాస్తుకు చివరి తేదీ:

  • 02-09-2024

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio