iDreamPost
android-app
ios-app

ఇంటర్ పాసైతే చాలు.. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో జాబ్ పొందే ఛాన్స్

  • Published May 18, 2024 | 9:45 PM Updated Updated May 18, 2024 | 9:45 PM

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి గుడ్ న్యూస్. ఇంటర్ పాసైన వారు ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో జాబ్ కొట్టే ఛాన్స్ వచ్చింది. ఈ పోస్టులకు వెంటనే అప్లై చేసుకోండి.

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి గుడ్ న్యూస్. ఇంటర్ పాసైన వారు ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో జాబ్ కొట్టే ఛాన్స్ వచ్చింది. ఈ పోస్టులకు వెంటనే అప్లై చేసుకోండి.

  • Published May 18, 2024 | 9:45 PMUpdated May 18, 2024 | 9:45 PM
ఇంటర్ పాసైతే చాలు.. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో జాబ్ పొందే ఛాన్స్

డిగ్రీలు, పీజీలు చేసినా ఉద్యోగాలు రావడం లేదని నిరుద్యోగులు నిరాశ చెందుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు తక్కువగా ఉండడంతో పోటీ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ప్రైవేట్ రంగంలో కూడా అదే పరిస్థితి నెలకొన్నది. మరి మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నట్లైతే ఇదే మంచి అవకాశం. మీరు ఇంటర్ అర్హతతోనే ప్రభుత్వ ఉద్యోగాలను పొందే ఛాన్స్ వచ్చింది. ఇంటర్ అర్హతతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం సాధిస్తే మంచి జీతంతో పాటు దేశానికి సేవ చేసే అవకాశం దక్కుతుంది.

రక్షణ రంగాల్లో జాబ్ చేయాలని యూత్ కలలుకంటుంటారు. ఇందుకోసం చాలామంది ప్రిపేర్ అవుతుంటారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో జాబ్‌ నోటిఫికేషన్‌ రిలీజ్ అయ్యింది. ఎయిర్‌మెన్ గ్రూప్ వై మెడికల్ అసిస్టెంట్ పోస్టులను ఈ భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు మే 22 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. జూన్ 5 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన రిక్రూట్‌మెంట్ ర్యాలీ ఛండీగడ్‌లో జరుగుతుంది. జులై 3 నుంచి 12వ తేదీ మధ్య ఈ ర్యాలీని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్వహించనున్నది. పూర్తి వివరాల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

అర్హత:

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఎయిర్‌మెన్ గ్రూప్ వై మెడికల్ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్మీడియట్‌ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. ఇంటర్‌లో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్‌లో కనీసం 50 శాతం మార్కులతో పాసై ఉండాలి. రెండేళ్ల వొకేషనల్ కోర్సులో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందిన వాళ్లు కూడా అర్హులు.

వయోపరిమితి:

అభ్యర్థులు 2000 జూన్ 24, 2005 జూన్ 24 గడువు మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం:

సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్‌, రాత పరీక్ష, అడాప్టబిలిటీ టెస్టు, మెడికల్ టెస్ట్‌ ద్వారా ఎంపిక చేస్తారు.

Jojobet Girişjojobet güncel girişMadridbetMadridbetJojobetJojobetjojobetJojobetlunabetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet