India Post GDS Merit List: ఇండియా పోస్ట్ జీడీఎస్ ఫలితాలు 2024: స్టేట్ వారీగా మెరిట్ జాబితా

India Post GDS Recrutiment 2024 Merit List: ఇండియా పోస్ట్ గ్రామీణ డాక్ సేవక్ రిక్రూట్మెంట్ 2024కి సంబంధించి మెరిట్ లిస్టుని విడుదల చేసింది. ఇండియా పోస్ట్ లో ఉన్న 44,228 ఖాళీల భర్తీకి సంబంధించి దరఖాస్తులను స్వీకరించిన ఇండియా పోస్ట్ షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.

India Post GDS Recrutiment 2024 Merit List: ఇండియా పోస్ట్ గ్రామీణ డాక్ సేవక్ రిక్రూట్మెంట్ 2024కి సంబంధించి మెరిట్ లిస్టుని విడుదల చేసింది. ఇండియా పోస్ట్ లో ఉన్న 44,228 ఖాళీల భర్తీకి సంబంధించి దరఖాస్తులను స్వీకరించిన ఇండియా పోస్ట్ షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.

ఇండియా పోస్ట్ గ్రామీణ డాక్ సేవక్ రిక్రూట్మెంట్ లో భాగంగా 44,228 ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు ఆ మధ్య ఇండియా పోస్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసింది. పదవ తరగతి పరీక్షల్లో ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చాయో వారి జాబితాను విడుదల చేసింది. ఇండియా పోస్ట్ గ్రామీణ డాక్ సేవక్ 2024 ఫలితాలు ఆగస్టు 19న వెలువడ్డాయి. గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) రిక్రూట్మెంట్ 2024కి సంబంధించిన ఫలితాలను ఇండియా పోస్ట్ అధికారిక వెబ్ సైట్ లో ప్రకటించింది. డివిజన్ పేరు, ఆఫీస్, పోస్ట్ పేరు, పోస్ట్ కమ్యూనిటీ, రిజిస్ట్రేషన్ నంబర్, మార్కులు, డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకోవాల్సిన అడ్రస్ వంటి వివరాలతో పీడీఎఫ్ ఫైల్స్ ని అందుబాటులో ఉంచింది.

జీడీఎస్ రిక్రూట్మెంట్ 2024లో షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థుల జాబితా ఆధారంగా ఎవరెవరు ఉత్తీర్ణులయ్యారో ఆన్ లైన్ లో తెలుసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, అస్సాం, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ డివిజన్ల వారీగా జాబితాను విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా షార్ట్ లిస్ట్ అయ్యారో లేదో తెలుసుకోవచ్చు. అలానే  ఏ పోస్టు వచ్చిందో కూడా తెలుసుకోవచ్చు. అయితే షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు పీడీఎఫ్ డాక్యుమెంట్ లో తెలిపిన సంబంధిత డివిజన్ హెడ్ ఆఫీస్ లో పోస్టుకి అవసరమైన డాక్యుమెంట్స్ ని సెప్టెంబర్ 3వ తేదీలోపు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒరిజినల్ డాక్యుమెంట్స్ తో పాటు రెండు సెట్ల సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోకాపీలను వెరిఫికేషన్ పర్పస్ హెడ్ ఆఫీస్ లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.    

మీరు ఎంపికయ్యారో లేదో ఇలా చెక్ చేసుకోండి:

  • షార్ట్ లిస్ట్ జాబితాను చూసేందుకు అధికారిక వెబ్ సైట్(indiapostgdsonline.gov.in/) లోకి వెళ్లాలి. 
  • వెబ్ సైట్ లో క్యాండిడేట్స్ కార్నర్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది. 
  • అందులో ఆఖరున న్యూ అని ఒక ఎర్రని టెక్స్ట్ హైలైట్ అవుతుంటుంది. 
  • జీడీఎస్ ఆన్ లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్, జూలై -2024 షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ మీద క్లిక్ చేస్తే డివిజన్స్ కనిపిస్తాయి. 
  • ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ మీద క్లిక్ చేయండి. 
  • లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని హైలైట్ అవుతుంది. 
  • దాని మీద క్లిక్ చేస్తే డౌన్ లోడ్ ఆప్షన్ కనబడుతుంది. 
  • డౌన్ లోడ్ చేసి మీరు ఎంపికయ్యారో లేదో చెక్ చేసుకోవచ్చు.
  • ఇండియా పోస్ట్ అధికారిక వెబ్ సైట్ లో మెరిట్ లిస్ట్ చూసేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.
Show comments