iDreamPost
android-app
ios-app

డిగ్రీ పాసైతే చాలు?.. 4455 Bank జాబ్స్ మీవే .. ఇక వద్దన్నా జాబ్

  • Published Aug 01, 2024 | 8:45 PM Updated Updated Aug 01, 2024 | 8:45 PM

నిరుద్యోగుల కోసం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) తాజాగా భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మెుత్తం 4455 ప్రొబేషనరీ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మరీ, ఆ సమాచారంను తెలుసుకుందాం.

నిరుద్యోగుల కోసం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) తాజాగా భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మెుత్తం 4455 ప్రొబేషనరీ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మరీ, ఆ సమాచారంను తెలుసుకుందాం.

  • Published Aug 01, 2024 | 8:45 PMUpdated Aug 01, 2024 | 8:45 PM
డిగ్రీ పాసైతే చాలు?.. 4455 Bank జాబ్స్ మీవే .. ఇక వద్దన్నా జాబ్

దేశంలో నిరుద్యోగులు రోజు రోజుకి ఎక్కువైపోతున్నారు. ముఖ్యంగా ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగం చేస్తే సరిపోని జీతం, సెక్యూరు లేని జాబ్స్ కారణంగా చాలామంది యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతారు. అందుకోసం సరిగా తిండి లేక, రాత్రింబవళ్లు కష్టపడి చదువుతూ.. ఎలాగైనా ఈ ప్రభుత్వ ఉద్యోగలను సంపాదించాలని ఆశ పడుతుంటారు. అయితే ఈ ప్రభుత్వ ఉద్యోగాల్లో బ్యాంకు ఉద్యోగాలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఈ బ్యాంకు ఉద్యోగం వస్తే.. లైఫ్ హ్యాపీగా సాగిపోతుందని అందరూ అభిప్రాయపడతారు.

బ్యాంకు ఉద్యోగమైతే మంచి జీతం, ఆహ్లాదకరమైన వాతావరణంలో విధులు, సెలవులు కూడా అధికంగా ఉండడంతో బ్యాంకు ఉద్యోగాలకు క్రేజ్ ఎక్కువ. యువత ఏళ్ల తరబడి బ్యాంకు ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతుంటారు. మరీ అలాంటి నిరుద్యోగులకు ఓ శుభవార్త.  తాజాగా ఐబీపీఎస్ భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మరీ, ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తాజాగా నిరుద్యోగుల కోసం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మెుత్తం 4455 ప్రొబేషనరీ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అలాగే ఆగస్టు 1వ తేదీన ప్రొబేషనరీ ఆఫీసర్స్ /మేనేజ్ మెంట్ ట్రైనీల (సీఆర్ పీవో/ఎంటీ) కామన్ రిక్రూట్ మెంట్ ప్రాసెస్‌కు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక ఈ నోటిఫికేషన్ కు  దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అయితే ఈ జాబ్ కు ఆసక్తి,  అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.ibps.in/ లో రిజిస్ట్రేషన్ కమ్ అప్లికేషన్ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

అయితే ఈ భారీ జాబ్ నోటిఫికేషన్ కు  దరఖాస్త గడువు ఆగస్టు 1వ తేదీ నుంచి 21 తేదీ వరకు ఉంది. ఇక ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ టెస్ట్‌ (ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌), ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అలాగే ప్రిలిమ్స్ పరీక్ష అక్టోబర్‌లో ఉంటుంది. మెయిన్స్ పరీక్ష నవంబర్ లో నిర్వహిస్తారు. కాగా, ఈ మెయిన్స్ ఫలితాలు డిసెంబర్ నెలాఖరులో కానీ, 2025 జనవరి నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది. అనంతరం ఇంటర్వ్యూలు ఫిబ్రవరి నెలలో నిర్వహించే అవకాశం ఉంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే.. పూర్తి వివరాలకు https://www.ibps.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

ఇక ఏడాది ఐబీపీఎస్ పీవో 2024 నోటిఫికేషన్‌ ద్వారా 11 భాగస్వామ్య బ్యాంకుల్లో 4455 ఖాళీల భర్తీకి సంబంధించి నియామక ప్రక్రియ చేపట్టనున్నారు.  అయితే అందులో బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ఐబీపీఎస్ పీఓ 2024 దరఖాస్తు సమచారం సమాచారం :

దరఖాస్తు వయసు పరిమితి:

  • ఆగస్టు 1, 2024 నాటికి కనీసం 20 ఏళ్లు నుంచి 30 ఏళ్లు మించకూడదు. అనగా, అభ్యర్థులు ఆగస్టు 2, 1994 కంటే ముందు, ఆగస్టు 1, 2004 తర్వాత జన్మించి ఉండాలి. ఇక రిజర్డ్వ్‌ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అర్హాతలు:

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా భారత ప్రభుత్వం గుర్తించిన తత్సమాన విద్యార్హత ఉండాలి.
  • అభ్యర్థి గ్రాడ్యుయేషన్లో సాధించిన మార్కులతో పాటు గ్రాడ్యుయేట్ అని సూచించే చెల్లుబాటు అయ్యే మార్కుల షీట్ / సర్టిఫికేట్‌ను రిజిస్ట్రేషన్ తేదీలో కలిగి ఉండాలి.
  • అలాగే జాయిన్ అయ్యే సమయంలో అభ్యర్థులు హెల్తీ క్రెడిట్ హిస్టరీ మెయింటైన్ చేయాలి.
  • భాగస్వామ్య బ్యాంకుల పాలసీ ప్రకారం కనీస క్రెడిట్ స్కోర్ ఉంటుంది.

దరఖాస్తు ఫీజు:

ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు రూ.175 (జీఎస్టీతో కలిపి), మిగతా వాటికి రూ.850 (జీఎస్టీతో కలిపి) చెల్లించాలి.

Jojobet GirişJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş