కొడితే ఇలాంటి జాబ్స్ కొట్టాలి.. CSIRలో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షన్నర వరకు జీతం!

ఉద్యోగాల కోసం ఎదురు చూసే నిరుద్యోగులకు గొప్ప అవకాశం. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్​ అండ్ ఇండస్ట్రియల్​ రీసెర్చ్ భారీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పూర్తి సమాచారం మీకోసం..

ఉద్యోగాల కోసం ఎదురు చూసే నిరుద్యోగులకు గొప్ప అవకాశం. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్​ అండ్ ఇండస్ట్రియల్​ రీసెర్చ్ భారీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పూర్తి సమాచారం మీకోసం..

గవర్నమెంట్ జాబ్స్ చాలా పడుతుంటాయి.. కానీ ఇలాంటి జాబ్స్ మాత్రం అప్పుడప్పుడు మాత్రమే వస్తుంటాయి. ప్రభుత్వ ఉద్యోగ వేటలో ఉన్నవారికి గుడ్ న్యూస్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్​ అండ్ ఇండస్ట్రియల్​ రీసెర్చ్ భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రక్రియను ప్రారంభించింది. డిగ్రీ అర్హతతోనే మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను దక్కించుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు ఏకంగా రూ. లక్షన్నర వరకు అందుకోవచ్చు. మరి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ ఉద్యోగాన్ని పొంది జీవితంలో ఉన్నతంగా స్థిరపడండి. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

మీరు ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లైతే ఇలాంటి జాబ్స్ ను మాత్రం అస్సలు మిస్ కావొద్దు. నీ టార్గెట్ 10 మైల్స్ అయితే ఎయిమ్ ఫర్ ది 11 మైల్ కావాలి. కొడొతే ఇలాంటి జాబ్ ను కొట్టి ఔరా అనిపించుకోవాలి. ఢిల్లీలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్​ అండ్ ఇండస్ట్రియల్​ రీసెర్చ్ సెక్షన్ ఆఫీసర్​, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 444 పోస్టులను భర్తీ చేయనున్నది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు పూర్తి వివరాలకు సీఎస్ఐఆర్ అధికారిక వెబ్ సైట్ https://www.csir.res.in/ను పరిశీలించాలి.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం పోస్టులు:

  • 444

ఖాళీల వివరాలు:

  • సెక్షన్ ఆఫీసర్​ – 76
  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ – 368

అర్హతలు:

  • అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యాసంస్థ నుంచి డిగ్రీ పాసై ఉండాలి.

వయోపరిమితి:

  • అభ్యర్థుల గరిష్ఠ వయస్సు 33 ఏళ్లు మించకూడదు. కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.

అప్లికేషన్ ఫీజు:

  • అన్ రిజర్వుడ్​, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్​ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.500 చెల్లించాలి.
    ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్​మ్యాన్​, సీఎస్ఐర్ డిపార్ట్​మెంట్ అభ్యర్థులు, మహిళలకు దరఖాస్తు రుసుము నుంచి మినహాయింపు ఉంది.

ఎంపిక ప్రక్రియ:

  • అభ్యర్థులకు స్టేజ్-1, స్టేజ్​-2 రాత పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో పాసైన వారికి కంప్యూటర్​ ప్రొఫీషియన్సీ టెస్ట్​ నిర్వహిస్తారు. దీనిలో క్వాలిఫై అయిన అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి, అర్హులైనవారిని సంబంధిత పోస్టులకు ఎంపిక చేస్తారు.

జీతభత్యాలు:

  • సెక్షన్ ఆఫీసర్​ గ్రూప్​-బి (గెజిటెడ్​) పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.47,600 – రూ.1,51,100 అందిస్తారు.
    అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గ్రూప్​-బి (నాన్​-గెజిటెడ్​) పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.44,900 – రూ.1,42,400 వెతనం పొందొచ్చు.

అప్లికేషన్ విధానం:

  • ఆన్ లైన్

అప్లికేషన్ ప్రారంభ తేదీ :

  • 08-12-2023

దరఖాస్తుకు చివరి తేదీ :

  • 12-01-2024

సీఎస్ఐఆర్ అధికారిక వెబ్ సైట్:

https://www.csir.res.in/

Show comments