iDreamPost
android-app
ios-app

సాఫ్ట్‌వేర్ ఫీల్డ్ లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారా? Cognizantలో జాబ్స్.. బెస్ట్ ఫ్యూచర్

Cognizant: గ్రాడ్యుయేట్స్ కు గుడ్ న్యూస్. ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీ భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే ఏడాదికి రూ. 2.52 లక్షల జీతం అందుకోవచ్చు.

Cognizant: గ్రాడ్యుయేట్స్ కు గుడ్ న్యూస్. ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీ భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే ఏడాదికి రూ. 2.52 లక్షల జీతం అందుకోవచ్చు.

సాఫ్ట్‌వేర్ ఫీల్డ్ లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారా? Cognizantలో జాబ్స్.. బెస్ట్ ఫ్యూచర్

మీరు గ్రాడ్యుయేషన్ రీసెంట్ గా పూర్తి చేశారా? జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారా? ఫ్రెషర్స్ కోసం ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీ గుడ్ న్యూస్ అందించింది. వరల్డ్ వైగ్ గా దిగ్గజ కంపెనీల్లో లే ఆఫ్స్ కొనసాగుతున్న వేళ భారీ స్థాయిలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రెడీ అవుతోంది. జాబ్ లేక నిరాశ చెందుతున్న నిరుద్యోగులుకు ఎడారిలో ఒయాసిస్ కనిపించినట్టుగా ప్రముఖ ఐటీ కంపెనీలో జాబ్ కొట్టే ఛాన్స్ వచ్చింది. ఇటీవల కాగ్నిజెంట్ ఆఫ్ క్యాంపస్ హైరింగ్ డ్రైవ్ ను ప్రకటించింది. 2024 బ్యాచ్ కు చెందిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే ఏడాదికి 2.52 లక్షల జీతం అందుకోవచ్చు. మరి మీరూ ట్రై చేయండి.

ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ ఐటీ ప్రోగ్రామర్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. డిగ్రీ, బీటెక్ గ్రాడ్యూయేట్స్ అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫీజులు ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు. అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు. జాబ్ పొందిన వారికి ఏడాదికి రూ. 2.52 లక్షల జీతం అందిస్తారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 14 వరకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

  • ఐటీ ప్రోగ్రామర్ ట్రైనీ పోస్టులు

అర్హత:

  • ఈ ఉద్యోగాలకు డిగ్రీ, బీటెక్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.

వయోపరిమితి:

  • ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరములు నిండి ఉండాలి.

ఫీజు:

  • ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన పనిలేదు.

జీతం:

  • ఏడాదికి 2.52 లక్షల జీతం అందిస్తారు.

ఎంపిక ప్రక్రియ:

  • ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.

అనుభవం :

  • ఎటువంటి అనుభవం అవసరం లేదు.

దరఖాస్తుకు చివరి తేదీ:

  • 14-08-2024