iDreamPost
android-app
ios-app

ఇంటర్ అర్హతతో సీఐఎస్ఎఫ్‌లో ఉద్యోగాలు.. పరీక్ష లేదు.. నెలకు జీతం రూ. 80 వేలు!

ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? గవర్నమెంట్ ఉద్యోగం సాధించడం మీ లక్ష్యమా? అయితే మీకు ఇదే మంచి తరుణం. మీరు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైతే ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉంది.

ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? గవర్నమెంట్ ఉద్యోగం సాధించడం మీ లక్ష్యమా? అయితే మీకు ఇదే మంచి తరుణం. మీరు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైతే ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉంది.

ఇంటర్ అర్హతతో సీఐఎస్ఎఫ్‌లో ఉద్యోగాలు.. పరీక్ష లేదు.. నెలకు జీతం రూ. 80 వేలు!

ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? గవర్నమెంట్ ఉద్యోగం సాధించడం మీ లక్ష్యమా? అయితే మీకు ఇదే మంచి తరుణం. మీరు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైతే ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉంది. కాగా ఉద్యోగాల కోసం ఎదురు చూసే నిరుద్యోగులకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ శుభవార్తను అందించింది. సీఐఎస్ఎఫ్‌లో హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 215 పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా ఇంటర్మీడియట్ అర్హతతో మీరు ఈ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. మరి ఈ ఉద్యోగాలకు అర్హత, వయోపరిమితి వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం.

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ 215 హెడ్ కానిస్టేబుల్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. అర్హత గల అభ్యర్థులు సీఐఎస్ఎఫ్‌ అధికారిక సైట్ cisfrectt.cisf.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 30 నుండి ప్రారంభమై నవంబర్ 28, 2023న ముగుస్తుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ముందుగా అధికారిక వెబైసైట్ ను సందర్శించి రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన సమాచారాన్ని క్షుణ్ణంగా చదివి అప్లై చేసుకోవాలని సీఐఎస్ఎఫ్‌ కోరింది.

ముఖ్యమైన సమాచారం

పోస్టుల సంఖ్య

215 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు

అర్హత

అభ్యర్థులు రాష్ట్ర/జాతీయ/అంతర్జాతీయ స్థాయిలో క్రీడలు మరియు అథ్లెటిక్స్‌కు ప్రాతినిధ్యం వహించి ఉండాలి. అలాగే, ఏదైనా గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుండి 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి

అభ్యర్థుల వయోపరిమితి 18 నుండి 23 సంవత్సరాల మధ్య ఉండాలి

ఎంపిక ప్రక్రియ

రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో ట్రయల్ టెస్ట్, ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంటేషన్ మరియు మెడికల్ టెస్ట్ ఉంటాయి. సీఐఎస్ఎఫ్‌ రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్‌లో మాత్రమే ఆన్‌లైన్ మోడ్ ద్వారా అభ్యర్థులకు అన్ని దశల రిక్రూట్‌మెంట్ కోసం కాల్-అప్ లెటర్‌లు/అడ్మిట్ కార్డ్‌లు జారీ చేయబడతాయి.

అప్లికేషన్ ఫీజు

హెడ్ ​​కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అన్‌రిజర్వ్‌డ్, ఓబీసీ మరియు ఈడబ్య్లూఎస్ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 100. మహిళా అభ్యర్థులు మరియు ఎస్సీ/ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజులో మినహాయింపు ఇవ్వబడింది.

దరఖాస్తు ప్రారంభ తేదీ

30-10-2023

దరఖాస్తు చివరి తేదీ

28-11-2023

దరఖాస్తు విధానం

ఆన్ లైన్

సీఐఎస్ఎఫ్‌ అధికారిక వెబ్‌సైట్‌

cisfrectt.cisf.gov.in