iDreamPost

ఈ అర్హతలుంటే చాలు? ఈ పోస్టులు మీకోసమే.. నెలకు 42 వేల జీతం

మీకు ఈ అర్హతలున్నాయా? అయితే ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మీకోసమే. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 42 వేల జీతం అందుకోవచ్చు. వెంటనే అప్లై చేసుకోండి.

మీకు ఈ అర్హతలున్నాయా? అయితే ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మీకోసమే. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 42 వేల జీతం అందుకోవచ్చు. వెంటనే అప్లై చేసుకోండి.

ఈ అర్హతలుంటే చాలు? ఈ పోస్టులు మీకోసమే.. నెలకు 42 వేల జీతం

మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నట్లైతే గుడ్ న్యూస్. ఇటీవల కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైతే చాలు కేంద్ర ప్రభుత్వ కొలువులను సాధించి లైఫ్ లో సెట్ కావొచ్చు. తాజాగా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఏపీలోని రాజమహేంద్రవరంలోని ఐకార్.. సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్సిట్యూట్ యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది.

కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నది. పోస్టులను అనుసరించి అభ్యర్థులు ఆర్గానిక్ కెమిస్ట్రీలో డిగ్రీ, సైన్స్/ఇంజినీరింగ్ విభాగంలో ఎంఈ/ఎంటెక్, బీఈ/ బీటెక్, బయోకెమిస్ట్రీలో డిగ్రీ, కెమిస్ట్రీ సబ్జెక్ట్ తో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు 30 వేల నుంచి 42 వేల వరకు అందుకోవచ్చు. అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న వారు జూన్ 10 వరకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

పోస్టుల వివరాలు:

యంగ్ ప్రొఫెషనల్I

యంగ్ ప్రొఫెషనల్II

విభాగాలు:

  • ఫుడ్ ప్రాసెసింగ్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, బయో కెమిస్ట్రీ.

అర్హత:

  • పోస్టులను అనుసరించి అభ్యర్థులు ఆర్గానిక్ కెమిస్ట్రీలో డిగ్రీ, సైన్స్/ఇంజినీరింగ్ విభాగంలో ఎంఈ/ఎంటెక్, బీఈ/ బీటెక్, బయోకెమిస్ట్రీలో డిగ్రీ, కెమిస్ట్రీ సబ్జెక్ట్ తో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి.

వయోపరిమితి:

  • అభ్యర్థులు 21 ఏళ్ల నుంచి 45ఏళ్ల వయసును కలిగి ఉండాలి.

జీతం:

  • యంగ్ ప్రొఫెషనల్I ఉద్యోగాలకు ఎంపికైతే 30 వేలు అందుకోవచ్చు. యంగ్ ప్రొఫెషనల్II పోస్టులకు ఎంపికైతే 42వేలు పొందొచ్చు.

దరఖాస్తు విధానం:

  • ఆఫ్ లైన్ దరఖాస్తులను డైరెక్టర్, ఐసీఏఆర్-సీటీఆర్ఐ, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ చిరునామాకు డైరెక్టుగా గాని పోస్టు ద్వారా గాని పంపించాలి.

దరఖాస్తుకు చివరి తేదీ:

  • 01-06-2024

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి