iDreamPost
android-app
ios-app

బ్యాంక్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా?.. పరీక్ష లేకుండానే బ్యాంక్ జాబ్స్ రెడీ.. మిస్ చేసుకోకండి

TGCAB DCCB Recruitment 2024: బ్యాంకింగ్ సెక్టార్ లో స్థిరపడాలనుకుంటున్నారా? అయితే మీకు గోల్డెన్ ఛాన్స్. పరీక్ష లేకుండానే జాబ్ కొట్టే ఛాన్స్ వచ్చింది. వెంటనే అప్లై చేసుకోండి.

TGCAB DCCB Recruitment 2024: బ్యాంకింగ్ సెక్టార్ లో స్థిరపడాలనుకుంటున్నారా? అయితే మీకు గోల్డెన్ ఛాన్స్. పరీక్ష లేకుండానే జాబ్ కొట్టే ఛాన్స్ వచ్చింది. వెంటనే అప్లై చేసుకోండి.

బ్యాంక్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా?.. పరీక్ష లేకుండానే బ్యాంక్ జాబ్స్ రెడీ.. మిస్ చేసుకోకండి

ఐటీ జాబ్స్ కు ఎంతలా డిమాండ్ ఉంటుందో బ్యాంక్ జాబ్స్ కు అదే రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. అందుకే యూత్ అంతా బ్యాంకింగ్, ఐటీ సెక్టార్ లో స్థిరపడేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే ఇటీవల సాఫ్ట్ వేర్ జాబ్స్ గాల్లో దీపాలమాదిరి అయిపోయాయి. దిగ్గజ కంపెనీల లేఆఫ్స్ తో ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో టెక్నికల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన వారు సైతం బ్యాంక్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారు. బ్యాంకింగ్ రంగంలో కూడా ఉన్నత స్థాయిలో స్థిరపడొచ్చు. మంచి జీతం, లీవ్స్, ఇలా అద్భుతమైన సౌకర్యాలుంటాయి. దీంతో బ్యాంక్ జాబ్స్ కు ఫుల్ కాంపిటీషన్ ఉంటుంది. ఏళ్లకేళ్లు ప్రిపేర్ అవుతుంటారు. బ్యాంక్ జాబ్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంటారు.

మరి మీరు కూడా బ్యాంక్ జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారా? బ్యాంక్ సెక్టార్ లో స్థిరపడాలనుకుంటున్నారా? అయితే మీకు గోల్డెన్ ఛాన్స్. పరీక్ష లేకుండానే బ్యాంక్ జాబ్ సాధించే ఛాన్స్ వచ్చింది. అప్లై చేస్తే చాలు జాబ్ పక్కాగా వచ్చే అవకాశం ఉంది. ఈజీగా బ్యాంక్ జాబ్ సాధించి లైఫ్ లో స్థిరపడిపోవచ్చు. తాజాగా తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్ ఇంటర్న్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఒప్పంద ప్రాతిపదికన 10 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల్లో తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్‌ బ్యాంక్‌ (టీజీసీఏబీ) 01, డిస్ట్రిక్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ (డీసీసీబీ) 09 ఉన్నాయి. ఈ జాబ్స్ కు పోటీ పడే అభ్యర్థులు పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీఏ (మార్కెటింగ్/ కోఆపరేటివ్/ అగ్రి బిజినెస్/ రూరల్ డెవలప్‌మెంట్), పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.

కంప్యూటర్ నాలెడ్జ్, తెలుగు భాషలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. వయసు 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ పోస్టులకు విద్యార్హతల్లో సాధించిన మార్కులు, షార్ట్‌లిస్ట్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.25 వేల వరకు వేతనం ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఆదిలాబాద్, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్‌, మెదక్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్ ప్రాంతాల్లో పని చేయాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు నవంబర్ 30 వరకు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను ది డిప్యూటీ జనరల్ మేనేజర్, హ్యుమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్, ది తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ట్రూప్ బజార్, హైదరాబాద్ చిరునామాకు పంపించాలి. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ tscab.orgను సందర్శించాల్సి ఉంటుంది.