iDreamPost
android-app
ios-app

Govt Job మీ లక్ష్యమా? ఇంటర్ పాసైతే చాలు.. 2006 ఉద్యోగాలు రెడీ.. ఇలా అప్లై చేసుకోండి

  • Published Jul 27, 2024 | 3:57 PM Updated Updated Jul 27, 2024 | 3:57 PM

SSC Stenographer Recruitment 2024: నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తీపికబురును అందించింది. ఏకంగా 2006 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వెంటనే అప్లై చేసుకోండి.

SSC Stenographer Recruitment 2024: నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తీపికబురును అందించింది. ఏకంగా 2006 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వెంటనే అప్లై చేసుకోండి.

  • Published Jul 27, 2024 | 3:57 PMUpdated Jul 27, 2024 | 3:57 PM
Govt Job మీ లక్ష్యమా? ఇంటర్ పాసైతే చాలు.. 2006 ఉద్యోగాలు రెడీ.. ఇలా అప్లై చేసుకోండి

ఉద్యోగం కోసం వెతికి విసిగిపోయారా? ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పలు ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. గవర్నమెంట్ జాబ్ లక్ష్యంగా పెట్టుకున్నవారికి ఇది గోల్డెన్ ఛాన్స్. మీరు నిరుద్యోగులుగా మిగిలిపోకూడదంటే వెంటనే అప్లై చేసుకోండి. ఇంటర్ అర్హతతోనే కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. ఇంటర్ ఉత్తీర్ణులై ఖాళీగా ఉన్నవారు ఈ జాబ్స్ ను అస్సలు మిస్ చేసుకోకండి. ఎస్ఎస్సి తాజాగా స్టెనో గ్రేడ్ సీ,డీ ఎగ్జామినేషన్ 2024 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ స్టెనో గ్రేడ్ సీ, డీ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 2006 ఉద్యోగాలను భర్తీ చేయనున్నది. గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి 12వ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్లు కలిగి ఉండాలి. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 17 వరకు అప్లై చేసుకోవచ్చు. ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు రూ. 100 చెల్లిస్తే సరిపోతుంది. ఈ ఉద్యోగాలకు సీబీటీ టెస్ట్, తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం :

విద్యార్హత :

  • అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి 12వ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి :

  • స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘సీ’: 2024 ఆగస్టు 1 నాటికి 18 నుంచి 30 ఏళ్లు.. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘డీ’: ఆగస్టు 1, 2024 నాటికి 18 నుంచి 27 ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం :

  • కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు :

  • అప్లికేషన్ ఫీజు రూ. 100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ (ఈఎస్ ఎం)లకు చెందిన మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.

దరఖాస్తులు ప్రారంభ తేది:

  • 26-07-2024

దరఖాస్తులకు చివరి తేదీ:

  • 17-08-2024

Jojobet Girişjojobet güncel girişMadridbetMadridbetJojobetJojobetjojobetJojobetlunabetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet