రైల్వేలో 14,298 టెక్నీషియన్ జాబ్స్.. మంచి జీతం.. ఇప్పుడే అప్లై చేసుకోండి

RRB Technician Recruitment 2024: మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నట్లైతే ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి. ఏకంగా 14 వేలకు పైగ టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి.

RRB Technician Recruitment 2024: మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నట్లైతే ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి. ఏకంగా 14 వేలకు పైగ టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి.

జాబ్ కోసం చేసే ప్రయత్నాలు అన్నీఇన్నీ కావు. ఏదోఒక జాబ్ దొరికితే బాగున్ను అని ఎదురుచూసే వారు ఎంతోమంది ఉన్నారు. ఇంట్లో ఖాళీగా ఉండలేక.. బయట కొలువు దొరకక నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత రోజుల్లో జాబ్స్ కు విపరీతమైన కాంపిటీషన్ ఉంది. మంచి జీతంతో కూడిన జాబ్స్ కావాలంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తో పాటు అదనపు స్కిల్స్ కూడా ఉండాల్సిందే. పోటీపరీక్షలు, ఇంటర్వ్యూల్లో అసాధారణ ప్రతిభను కనబర్చాల్సి ఉంటుంది. అప్పుడు గాని ఉద్యోగం మీ సొంతం కాదు. మరి మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నట్లైతే ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. రైల్వేలో 14,298 టెక్నీషియన్ జాబ్స్ భర్తీకోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ జాబ్స్ కొడితే లైఫ్ లో సెట్ అయిపోవచ్చు.

తాజాగా రైల్వే శాఖ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న 14,298 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అయితే గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లో 9,144 ఖాళీలు ఉండగా ఇప్పుడు మరిన్ని పోస్టులను పెంచి మొత్తం 14,298 పోస్టులను భర్తీ చేయనున్నది రైల్వే శాఖ. రైల్వే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వారికి ఇది మళ్లీరాని అవకాశం. ఆర్ఆర్బీ జోన్ల వారీగా 14,298 టెక్నీషియన్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నది. ఇందులో సికింద్రాబాద్‌ రైల్వే జోన్‌లో 959 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు టెన్త్ తో పాటు సంబంధింత ట్రేడుల్లో ఐటీఐ పాసై ఉండాలి. బీఎస్సీ, బీఈ, బీటెక్ పాసైన వారు కూడా అప్లై చేసుకోవచ్చు.

అభ్యర్థులు పోస్టులను అనుసరించి 18-36 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు, దివ్యాంగులకు 10-15 ఏళ్ల వయోసడలింపు ఉంటుంది. ఈ పోస్టులకు కంప్యూటర్‌ బేస్డ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నెలకు టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు రూ.29,200. టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు రూ.19,900 ప్రారంభ వేతనం ఉంటుంది. దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్స్, మహిళలు, ట్రాన్స్ జెండర్, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులకు రూ. 250, ఇతరులకు రూ. 500గా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు అక్టోబర్ 02 నుంచి 16 వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం పోస్టులు: 14,298

విభాగాల వారీగా ఖాళీలు:

  • టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్: 1092
  • టెక్నీషియన్ గ్రేడ్-III:8052
  • టెక్నీషియన్ గ్రేడ్-III: 5154

అర్హత:

  • టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్: బీఎస్సీ, బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.
    టెక్నీషియన్ గ్రేడ్-III: మెట్రిక్యులేషన్/ఐటీఐ పాసై ఉండాలి.

వయోపరిమితి:

  • టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు 18 -36, టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు 18-33 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు, దివ్యాంగులకు 10-15 ఏళ్ల వయోసడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం:

  • ఈ పోస్టులకు సంబంధించి కంప్యూటర్‌ బేస్డ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

జీతం:

  • నెలకు టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు రూ.29,200. టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు రూ.19,900 ప్రారంభ వేతనం ఉంటుంది.

దరఖాస్తు ఫీజు:

  • ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్స్, మహిళలు, ట్రాన్స్ జెండర్, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులకు రూ. 250, ఇతరులకు రూ. 500గా నిర్ణయించారు.

దరఖాస్తులు ప్రారంభం:

  • 02-10-2024

దరఖాస్తులకు చివరి తేదీ:

  • 16-10-2024
Show comments