iDreamPost
android-app
ios-app

రైల్వేలో 3445 క్లర్క్ జాబ్స్.. డిగ్రీ అవసరం లేదు.. మంచి జీతం.. మిస్ చేసుకోకండి

  • Published Oct 15, 2024 | 1:20 PM Updated Updated Oct 15, 2024 | 1:20 PM

RRB NTPC UG Recruitment 2024: మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నారా? అయితే ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి. రైల్వేలో 3445 జాబ్స్ భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి.

RRB NTPC UG Recruitment 2024: మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నారా? అయితే ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి. రైల్వేలో 3445 జాబ్స్ భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి.

  • Published Oct 15, 2024 | 1:20 PMUpdated Oct 15, 2024 | 1:20 PM
రైల్వేలో 3445 క్లర్క్ జాబ్స్.. డిగ్రీ అవసరం లేదు.. మంచి జీతం.. మిస్ చేసుకోకండి

నేటి రోజుల్లో డిగ్రీలు, పీజీలు పూర్తి చేసినా జాబ్ దొరకని పరిస్థితి. ఇటు ప్రభుత్వ ఉద్యోగాలు తక్కువగా ఉండి.. అటు ప్రైవేట్ సెక్టార్ లో కాంపిటీషన్ ఉండంతో నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ వచ్చినా లక్షల్లో పోటీపడుతున్నారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగం సాధించడం కష్టతరమైపోతున్నది. ఏళ్లకేళ్లు ప్రిపరేషన్ కొనసాగించినా ఫలితం దక్కని వారు ఎంతో మంది ఉన్నారు. అయినా నిరాశ చెందకుండా గవర్నమెంట్ కొలువు కోసం ట్రై చేస్తూనే ఉన్నారు. ఇలాంటి వారికి గుడ్ న్యూస్. భారతీయ రైల్వే నిరుద్యోగులకు తీపి కబురును అందించింది. ఇటీవల రైల్వే డిపార్ట్ మెంట్ నుంచి వేల సంఖ్యలో క్లర్క్ జాబ్స్ భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది.

మీరు డిగ్రీ అవసరం లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే ఛాన్స్ వచ్చింది. మంచి జీతంతో కూడిన ఈ జాబ్స్ ను సాధించి లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు. రైల్వేలో జాబ్ కోసం ట్రై చేస్తున్న వారు ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ అండర్‌ గ్రాడ్యుయేట్‌ రిక్రూట్‌మెంట్‌ 2024 ద్వారా 3445 క్లర్క్ జాబ్స్ న భర్తీ చేసేందుకు రెడీ అయ్యింది రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్. ఆర్ఆర్ బీ ద్వారా కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్టులు 2022, అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు, 361, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు 990, ట్రైన్స్ క్లర్క్ పోస్టులు 72 భర్తీ కానున్నాయి. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు ఇంటర్‌ పాసై ఉండాలి.

అభ్యర్థుల వయసు 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. ఆయా కేటగిరీ వర్గాల వారికి వయోసడలింపు నిబంధనలు వర్తిస్తాయి. సీబీటీ టెస్ట్, స్కిల్ టెస్ట్, మెడికల్ టెస్ట్, డాక్యూమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. జీతం చూసినట్లైతే.. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్టులకు 21 వేల 700, అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకు 19 వేల 900, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకు 19 వేల 900, ట్రైన్స్ క్లర్క్ పోస్టులకు 19 వేల 900 చెల్లిస్తారు.

దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, మహిళ, దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్, మైనార్టీలు, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (ఈబీసీ) కేటగిరీ అభ్యర్థులకు రూ.250గా నిర్ణయించారు. మిగతా వారు ఫీజు రూ.500 చెల్లించాలి. అభ్యర్థులు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ)కు హాజరైనప్పుడు దరఖాస్తు ఫీజును పాక్షికంగా రీఫండ్ చేస్తారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు అక్టోబర్ 20 వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ఇంకో 5 రోజుల్లో దరఖాస్తు ప్రక్రియ ముగియనున్నది. ఇంకా అప్లై చేసుకోని వారు వెంటనే అప్లై చేసుకోండి. పూర్తి సమాచారం కోసం www.rrbapply.gov.in ను సందర్శించాలి.

Jojobet GirişjojobetjojobetMadridbetMadridbetMadridbetMadridbetjojobetJojobetcasibomfixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş