10th, డిప్లొమా పాసైతే చాలు.. కేంద్ర విద్యుత్ సంస్థలో జాబ్స్ మీవే.. నెలకు 50 వేల జీతం

NTPC Mining Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. టెన్త్, డిప్లొమా పాసైతే చాలు కేంద్ర విద్యుత్ సంస్థల్లో జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 50 వేలు అందుకోవచ్చు.

NTPC Mining Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. టెన్త్, డిప్లొమా పాసైతే చాలు కేంద్ర విద్యుత్ సంస్థల్లో జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 50 వేలు అందుకోవచ్చు.

ఇటీవల కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. వేల సంఖ్యలో ఉద్యోగాలు భర్తీకానున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న వారికి గోల్డెన్ ఛాన్స్. టెన్త్, డిప్లొమా ఉత్తీర్ణులై ఖాళీగా ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వానికి చెందిన విద్యుత్ సంస్థ తీపి కబురును అందించింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. పదో తరగతి అర్హతతో జాబ్స్ లేవని బాధపడే వారికి ఇది సువర్ణావకాశం. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 50 వేల వరకు జీతం పొందొచ్చు.

నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ రిలీజ్ చేసింది. ఎన్‌టీపీసీకి చెందిన నేషనల్ మెటలర్జికల్ ల్యాబొరేటరీ, జంషెడ్‌పుర్‌.. నాన్‌ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ చేయనున్నది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 144 ఖాళీలను భర్తీ చేయనున్నారు. టెన్త్, డిప్లొమా పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆగస్టు 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం ఖాళీలు : 144

  • మైనింగ్‌ ఓవర్‌మ్యాన్‌: 67
  • మాగజైన్‌ ఇన్‌ఛార్జ్‌: 09
  • మెకానికల్ సూపర్‌వైజర్‌: 28
  • ఎలక్ట్రికల్‌ సూపర్‌వైజర్‌: 26
  • ఒకేషనల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌: 08
  • జూనియర్‌ మైన్‌ సూపీరియర్‌: 03
  • మైనింగ్‌ సర్దార్‌: 03

అర్హత:

  • పోస్టును అనుసరించి టెన్త్, సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో డిప్లొమా (మెకానికల్‌/ మైనింగ్‌/ ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రానిక్స్‌/ ప్రొడక్షన్‌) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి:

  • 05-08-2024 నాటికి 30 ఏళ్లు, ఒకేషనల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌ పోస్టుకు 40 ఏళ్లు మించకూడదు. ఆయా కేటగిరీ వర్గాల వారికి వయోసడలింపు నిబంధనలు వర్తిస్తాయి.

జీతం:

  • నెలకు మైనింగ్‌ సర్దార్‌ పోస్టుకు రూ.40,000, ఇతర పోస్టులకు రూ.50,000 ఉంటుంది.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ లైన్‌

ఎంపిక ప్రక్రియ:

  • రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ప్రారంభ తేదీ:

  • 17-07-2024

దరఖాస్తులకు చివరి తేదీ:

  • 05-08-2024
Show comments