పోలీస్ జాబ్ మీ లక్ష్యమా.. ITBPలో 526 పోలీస్ జాబ్స్ రెడీ.. ఇప్పుడే అప్లై చేసుకోండి

ITBP Recruitment 2024: పోలీస్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. ఐటీబీపీలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. మహిళలు కూడా అప్లై చేసుకోవచ్చు.

ITBP Recruitment 2024: పోలీస్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. ఐటీబీపీలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. మహిళలు కూడా అప్లై చేసుకోవచ్చు.

పోలీస్ జాబ్ కోసం యూత్ కలలుకంటుంటారు. కానీ, పోలీస్ ఉద్యోగం సాధించడం అంతా ఈజీ కాదు. అందుకే పోలీస్ జాబ్ సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తుంటారు. పుస్తకాలతో కుస్తీ పడుతూ, గ్రౌండ్ లో చెమటలు చిందిస్తూ పోలీస్ కొలువులకు రెడీ అవుతుంటారు. యూనిఫాం వేసుకుని దేశానికి సేవ చేయాలని భావిస్తుంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే పోలీస్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. పోలీస్ అవ్వాలని అందరికి ఉన్నా కొందరు మాత్రమే ఆ కలను నెరవేర్చుకుంటారు. ఈ మధ్యకాలంలో మహిళలు కూడా పోలీస్ జాబ్స్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. దీంతో పోలీస్ ఉద్యోగాలకు కాంపిటీషన్ విపరీతంగా పెరిగిపోయింది.

పోలీస్ జాబ్ కొట్టి లైఫ్ లో ఉన్నత స్థితిలో స్థిరపడొచ్చు. మరి మీరు కూడా పోలీస్ అవ్వాలనే కలను నెరవేర్చుకోవాలనుకుంటున్నారా? పోలీస్ జాబ్ అంటే మీకు ఇష్టమా? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ రక్షణ సంస్థ ఇండో- టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్‌ నిరుద్యోగులకు తీపి కబురును అందించింది. ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 526 పోస్టులను భర్తీ చేయనున్నది. గ్రూప్-బి నాన్-గెజిటెడ్ (నాన్ మినిస్టీరియల్) విభాగంలో ఎస్‌ఐ, గ్రూప్-సీ నాన్- గెజిటెడ్ (నాన్ మినిస్టీరియల్) విభాగంలో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ పోస్టులకు పురుషులతో పాటు మహిళలు కూడా అర్హులే. మళ్లీ రాని ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి.

ఈ పోస్టులకు అప్లై చేసుకోదలిచిన వారు ఎస్‌ఐ పోస్టులకు బీఎస్సీ, బీసీఏ లేదా బీఈ లేదా బీటెక్‌ పాసై ఉండాలి. హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు ఇంటర్ లేదా ఐటీఐ లేదా డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. కానిస్టేబుల్ పోస్టులకు టెన్త్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు ఎస్‌ఐ పోస్టులకు 20 నుంచి 25 ఏళ్లు.. హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు 18 నుంచి 25 ఏళ్లు, కానిస్టేబుల్ పోస్టులకు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ పోస్టులకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, రాత పరీక్ష, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఎస్సై పోస్టులకు రూ.35 వేల 400 నుంచి రూ.1 లక్ష 12 వేల 400.. హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు రూ.25 వేల 500 నుంచి రూ.81 వేల 100.. కానిస్టేబుల్ పోస్టులకు రూ.21 వేల 700 నుంచి రూ.69 వేల100 ఉంటుంది. దరఖాస్తు ఫీజు ఎస్‌ఐ పోస్టులకు రూ.200 చెల్లించాలి. హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్‌ పోస్టులకు రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు డిసెంబర్‌ 14వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం itbpolice.nic.in వెబ్ సైట్ ను పరిశీలించాల్సి ఉంటుంది.

Show comments