iDreamPost
android-app
ios-app

స్పోర్ట్స్ బాగా ఆడుతారా? HCAలో జాబ్ పొందే ఛాన్స్.. ఈ అర్హతలుండాలి

  • Published Jul 13, 2024 | 8:41 PM Updated Updated Jul 13, 2024 | 8:41 PM

Hyderabad Cricket Association Recruitment 2024: స్పోర్ట్స్ ఆడే వారికి గుడ్ న్యూస్. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వెంటనే అప్లై చేసుకోండి.

Hyderabad Cricket Association Recruitment 2024: స్పోర్ట్స్ ఆడే వారికి గుడ్ న్యూస్. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వెంటనే అప్లై చేసుకోండి.

  • Published Jul 13, 2024 | 8:41 PMUpdated Jul 13, 2024 | 8:41 PM
స్పోర్ట్స్ బాగా ఆడుతారా? HCAలో జాబ్ పొందే ఛాన్స్.. ఈ అర్హతలుండాలి

ప్రస్తుత రోజుల్లో చదువు ఒక్కటే జీవితాన్ని ఇవ్వదని నిరూపిస్తున్నారు యువత. చదువుతో పాటు క్రీడలు, మ్యూజిక్, యాక్టర్స్ గా రాణించేందుకు ఇంట్రెస్టు చూపిస్తున్నారు. ముఖ్యంగా స్పోర్ట్స్ ను కెరీర్ గా మలుచుకునేందుకు యూత్ మొగ్గుచూపుతున్నారు. వరల్డ్ వైడ్ గా క్రికెట్ కు ఎలాంటి క్రేజ్ ఉందో వేరే చెప్పక్కర్లేదు. ఒక్క మ్యాచ్ లో రాణిస్తే లైఫ్ సెట్ అయిపోయినట్టే. ఐపీఎల్ ద్వారా ఎంతో మంది క్రికెటర్లకు లైఫ్ దొరుకుతున్నది. మరి మీరు కూడా స్పోర్ట్స్ బాగా ఆడుతారా? అయితే మీకు ఉద్యోగం పొందే ఛాన్స్ వచ్చింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్.. కోచ్ లు (మహిళా మరియు పురుషులు), ఫిజియోథెరఫిస్ట్, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఫైనాన్స్ మేనేజర్, అడ్మిన్ మేనేజర్, స్టోర్ మేనేజర్, అకౌంట్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, క్రికెట్ ఆపరేషన్ అసిస్టెంట్స్, లీగల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నది. అకౌంట్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసుకునే వారు కామర్స్ లేదా ఫైనాన్స్ లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఉప్పల్ లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. క్రికెట్ కోచ్ పోస్టుల కోసం పోటీ పడే వారు బీసీసీఐ లెవల్ 1 సర్టిఫికేట్ కలిగి ఉండాలి. దీంతో పాటు 5 ఏళ్లు కోచింగ్ ఎక్స్ పీరియన్స్ ఉండాలి.

ఫైనాన్స్ మేనేజర్ పోస్టుల కోసం సీఏ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో 5 ఇయర్స్ అనుభవం ఉండాలి. లీగల్ అసిస్టెంట్ పోస్టుల కోసం అభ్యర్థులు లా డిగ్రీ లేదా డిప్లొమా కలిగి ఉండాలి. 3 ఏళ్లు అనుభవం కలిగి ఉండాలి. ఫిజియోథెరపిస్టు పోస్టుల కోసం స్పోర్ట్స్ లేదా మస్క్యులోస్కెలెటల్ ఫిజియోథెరపీ/స్పోర్ట్స్ & ఎక్సర్సైజ్ మెడిసిన్/స్పోర్ట్స్ రిహాబిలిటేషన్‌లో స్పెషలైజ్ చేయబడిన పోస్ట్ గ్రాడ్యుయేట్ అర్హత కలిగి ఉండాలి. ఆఫ్ లైన్ లో మీ పూర్తి వివరాలతో కూడిన సీవీతో పాటు సంబంధింత ధ్రువపత్రాలను ఉప్పల్ లో ని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలోని ఇన్ వార్డ్ సెక్షన్ లో సమర్పించవచ్చు. ఆన్ లైన్ లో కూడా అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

హైదరాబాద్ క్రికెట్ అసిసోయేషన్

పోస్టుల వివరాలు:

  • అకౌంట్ అసిస్టెంట్
  • క్రికెట్ కోచ్
  • ఫైనాన్స్ మేనేజర్
  • లీగల్ అసిస్టెంట్
  • ఫిజియోథెరపిస్టు
  • స్ట్రెంథ్ అండ్ కండీషనింగ్ కోచ్
  • స్టెనోగ్రాఫర్
  • అడ్మిన్ మేనేజర్
  • ఛీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్
  • స్టోర్స్ మేనేజర్

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet