ఇది కదా జాబ్ అంటే.. రూ. లక్ష జీతంతో Govt Jobs.. ఈ అర్హతలుంటే చాలు

GAIL Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే లక్షకు పైగా జీతం పొందొచ్చు.

GAIL Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే లక్షకు పైగా జీతం పొందొచ్చు.

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడమే మీ లక్ష్యమా? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు లక్షకు పైగా జీతం అందుకోవచ్చు. గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న గెయిల్‌ వర్క్ సెంటర్లు/ యూనిట్‌లలో పలు విభాగాల్లో నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 391 పోస్టులను భర్తీ చేయనున్నారు.

అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు సెప్టెంబర్‌ 7వ తేదీ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టులను అనుసరించి పదోతరగతి, ఇంటర్మీడియట్‌, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, సీఏ/ ఐసీడబ్ల్యూఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ, బీబీఎస్‌, బీబీఎం, బీఈ, బీటెక్‌, ఎమ్మెస్సీ, ఎంకాం, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 26-55 ఏళ్లు కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష, కంప్యూటర్‌ ప్రొఫీషియన్సీ టెస్ట్‌, ట్రేడ్/ స్కిల్ టెస్ట్, ఫిజికల్‌ ఎండ్యూరెన్స్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 391

విభాగాల వారీగా ఖాళీలు:

  • జూనియర్ ఇంజినీర్ (కెమికల్): 2
  • జూనియర్ ఇంజినీర్ (మెకానికల్): 1
  • ఫోర్‌మ్యాన్ (ఎలక్ట్రికల్): 1
  • ఫోర్‌మ్యాన్ (ఇన్‌స్ట్రుమెంటేషన్): 14
  • ఫోర్‌మ్యాన్ (సివిల్): 6
  • జూనియర్ సూపరింటెండెంట్ (అఫీషియల్‌ లాంగ్వేజ్‌): 5
  • జూనియర్ కెమిస్ట్: 8
  • జూనియర్ అకౌంటెంట్: 14
  • టెక్నికల్ అసిస్టెంట్ (ల్యాబొరేటరీ): 3
  • ఆపరేటర్ (కెమికల్): 73
  • టెక్నీషియన్ (ఎలక్ట్రికల్): 44
  • టెక్నీషియన్ (ఇన్‌స్ట్రుమెంటేషన్): 45
  • టెక్నీషియన్ (మెకానికల్): 39
  • టెక్నీషియన్ (టెలికాం అండ్‌ టెలిమెట్రీ): 11
  • ఆపరేటర్(ఫైర్): 39
  • ఆపరేటర్ (బాయిలర్): 08
  • అకౌంట్స్ అసిస్టెంట్: 13
  • బిజినెస్ అసిస్టెంట్: 65

అర్హత:

  • పోస్టులను అనుసరించి పదోతరగతి, ఇంటర్మీడియట్‌, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, సీఏ/ ఐసీడబ్ల్యూఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ, బీబీఎస్‌, బీబీఎం, బీఈ, బీటెక్‌, ఎమ్మెస్సీ, ఎంకాం, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి:

  • పోస్టులను అనుసరించి అభ్యర్థులు 26 నుంచి 55 ఏళ్లు వయసు కలిగి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ:

  • రాత పరీక్ష, కంప్యూటర్‌ ప్రొఫీషియన్సీ టెస్ట్‌, ట్రేడ్/ స్కిల్ టెస్ట్, ఫిజికల్‌ ఎండ్యూరెన్స్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

జీతం:

  • జూనియర్ ఇంజినీర్ పోస్టులకు రూ.35,000-1,38,000.. జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ కెమిస్ట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులకు రూ.29,000- రూ.1,20,000.. మిగిలిన పోస్టులకు రూ.24,500-రూ.90,000 జీతం ఉంటుంది.

దరఖాస్తు ఫీజు:

  • జనరల్‌ అభ్యర్థులు రూ.50. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్‌

దరఖాస్తులకు ప్రారంభ తేదీ:

  • 08-08-2024

దరఖాస్తులకు చివరి తేదీ:

  • 07-09-2024
Show comments