iDreamPost
android-app
ios-app

నెలకు లక్షన్నర జీతంతో Bank జాబ్స్.. ఇంకొన్ని రోజులే ఛాన్స్.. మిస్ చేసుకోకండి

  • Published Jul 17, 2024 | 8:59 AM Updated Updated Jul 17, 2024 | 8:59 AM

Bank Of Maharashtra Recruitment 2024: బ్యాంక్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు ఇదే మంచి అవకాశం. నెలకు లక్షన్నర జీతంతో బ్యాంక్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. డిగ్రీ ఉంటే చాలు.

Bank Of Maharashtra Recruitment 2024: బ్యాంక్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు ఇదే మంచి అవకాశం. నెలకు లక్షన్నర జీతంతో బ్యాంక్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. డిగ్రీ ఉంటే చాలు.

  • Published Jul 17, 2024 | 8:59 AMUpdated Jul 17, 2024 | 8:59 AM
నెలకు లక్షన్నర జీతంతో Bank జాబ్స్.. ఇంకొన్ని రోజులే ఛాన్స్.. మిస్ చేసుకోకండి

బ్యాంక్ జాబ్స్ కోసం యువత ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతుంటారు. బ్యాంక్ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. బ్యాంక్ ఉద్యోగాలకు కాంపిటీషన్ హెవీగానే ఉంటుంది. ఇటీవల వేల సంఖ్యలో బ్యాంక్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. మరి మీరు కూడా బ్యాంక్ జాబ్ కోసం సన్నద్ధమవుతున్నారా? అయితే ఇటీవల ప్రముఖ బ్యాంక్ పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మీరు డిగ్రీ అర్హతతోనే ఈ ఉద్యోగాలను అందుకోవచ్చు. ఈ జాబ్స్ కు అప్లై చేసుకునేందుకు ఇంకా కొన్ని రోజులే ఛాన్స్ ఉంది. వెంటనే అప్లై చేసుకోండి.

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఆఫీసర్ స్కేల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 195 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, ఛీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్, బిజినెస్ డెవలప్ మెంట్ ఆఫీసర్ జాబ్స్ ను నియమించుకోనున్నది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు లక్షన్నర వరకు జీతం పొందొచ్చు. అభ్యర్థులు డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, సీఏ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి. గరిష్టంగా 50 ఏళ్లు కలిగి ఉండాలి. ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు జులై 26 వరకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం పోస్టులు:

  • 195

పోస్టులు వివరాలు:

  • డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, ఛీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్, బిజినెస్ డెవలప్ మెంట్ ఆఫీసర్.

విభాగాలు:

  • ఇంటిగ్రేటెడ్ రిస్క్ మేనేజ్ మెంట్
  • ఫారెక్స్ అండ్ ట్రెజరీ
  • ఐటీ/డిజిటల్ బ్యాంకింగ్/ సీఐఎస్ఓ/ సీడీఓ
  • క్రెడిట్, ఎకనామిస్ట్ తదితర విభాగాలు

అర్హత:

  • అభ్యర్థులు డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, సీఏ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి:

  • గరిష్టంగా 50 ఏళ్లు కలిగి ఉండాలి.

ఎంపిక విధానం:

  • రాత పరీక్ష, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్, తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతం:

  • పోస్టులను అనుసరించి 64 వేల నుంచి లక్షన్నర వరకు అందిస్తారు.

దరఖాస్తు ఫీజు:

  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ. 118గా నిర్ణయించారు. ఇతరులకు రూ. 1180 చెల్లించాలి.

దరఖాస్తు విధానం:

  • ఆఫ్ లైన్ లో అప్లికేషన్లను జనరల్ మేనేజర్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, హెచ్.ఆర్.ఎం డిపార్ట్ మెంట్, హెడ్ ఆఫీస్, లోక్ మంగల్, శివాజీనగర్, పుణె చిరునామాకు పోస్టు ద్వారా పంపించాలి.

దరఖాస్తులు ప్రారంభం:

  • 11-07-2024

దరఖాస్తులకు చివరి తేదీ:

  • 26-07-2024

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet