iDreamPost
android-app
ios-app

ఇంకా అప్లై చేయలేదా?.. మీకోసం 2,006 Govt Jobs రెడీ.. నేడే లాస్ట్ డేట్

SSC Stenographer Recruitment 2024: నిరుద్యోగులకు బిగ్ అలర్ట్. 2006 ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ముగియనున్నది. నేడే చివరి తేదీ. వెంటనే అప్లై చేసుకోండి.

SSC Stenographer Recruitment 2024: నిరుద్యోగులకు బిగ్ అలర్ట్. 2006 ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ముగియనున్నది. నేడే చివరి తేదీ. వెంటనే అప్లై చేసుకోండి.

ఇంకా అప్లై చేయలేదా?.. మీకోసం 2,006 Govt Jobs రెడీ.. నేడే లాస్ట్ డేట్

నిరుద్యోగులకు బిగ్ అలర్ట్. మీరు ఎప్పటి నుంచో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ అవకాశాన్ని వదులుకోకండి. 2006 ప్రభుత్వ ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి. మీరు ఇంటర్ పాసై ఖాళీగా ఉన్నట్లైతే ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే ఛాన్స్ వచ్చింది. ఇటీవల స్టాఫ్ సెలక్షన్ కమిషన్ స్టెనో గ్రేడ్ సీ,డీ ఎగ్జామినేషన్ 2024 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనున్నది. మరి మీరు ఇంకా అప్లై చేయకపోతే వెంటనే అప్లై చేసుకోండి.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ స్టెనో గ్రేడ్ సీ, డీ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 2006 ఉద్యోగాలను భర్తీ చేయనున్నది. గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి 12వ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్లు కలిగి ఉండాలి. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 17 వరకు అప్లై చేసుకోవచ్చు. ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు రూ. 100 చెల్లిస్తే సరిపోతుంది. ఈ ఉద్యోగాలకు సీబీటీ టెస్ట్, తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం :

విద్యార్హత :

  • అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి 12వ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి :

  • స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘సీ’: 2024 ఆగస్టు 1 నాటికి 18 నుంచి 30 ఏళ్లు.. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘డీ’: ఆగస్టు 1, 2024 నాటికి 18 నుంచి 27 ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం :

  • కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు :

  • అప్లికేషన్ ఫీజు రూ. 100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ (ఈఎస్ ఎం)లకు చెందిన మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.

దరఖాస్తుల ప్రారంభ తేది:

  • 26-07-2024

దరఖాస్తులకు చివరి తేదీ:

  • 17-08-2024