P Venkatesh
SBI Sports Quota Recruitments 2024: స్పోర్ట్స్ ఆడేవారికి బెస్ట్ ఛాన్స్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. నెలకు 85 వేల జీతం పొందొచ్చు.
SBI Sports Quota Recruitments 2024: స్పోర్ట్స్ ఆడేవారికి బెస్ట్ ఛాన్స్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. నెలకు 85 వేల జీతం పొందొచ్చు.
P Venkatesh
ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో జాబ్స్ పొందాలంటే ఏదైనా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాల్సిందే. విద్యార్హతలను బట్టి ఉద్యోగాలను పొందొచ్చు. అయితే విద్యార్హతలతో పాటుగా స్పోర్ట్స్ ఆడే వారికి కూడా బెస్ట్ జాబ్స్ అందుబాటులో ఉన్నాయి. క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ప్రభుత్వాలు ఉన్నతమైన ఉద్యోగాలను ఆఫర్ చేస్తుంటాయి. అంటే మీరు స్పోర్ట్స్ బాగా ఆడినా కూడా మంచి జాబ్ పొంది లైఫ్ లో సెట్ అయిపోవచ్చు. మరి మీరు కూడా స్పోర్ట్స్ బాగా ఆడుతారా? అయితే మీలాంటి వారికి లక్కీ ఛాన్స్. ప్రభుత్వ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ ఆడేవారికి తీపికబురును అందించింది.
మీరు డిగ్రీ ఉత్తీర్ణులై క్రీడల్లో ప్రతిభ చూపినట్లైతే ఎస్బీఐలో జాబ్ పొందొచ్చు. ఎస్బీఐ స్పోర్ట్స్ కోటాలో ఆఫీసర్/క్లరికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 68 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. బాస్కెట్‌బాల్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, వాలీబాల్, కబడ్డీ, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ క్రీడల్లో సాధించిన సర్టిఫికేట్లు కలిగి ఉండాలి. పోస్టులను అనుసరించి 21-30ఏళ్ల వయసు కలిగి ఉండాలి. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆగస్ట్ 14 వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.