iDreamPost
android-app
ios-app

హైకోర్టులో లా క్లర్క్ ఉద్యోగాలు.. నెలకు 35 వేల జీతం.. అర్హులు వీరే

AP High Court Recruitment 2024: గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? పరీక్ష లేకుండానే హైకోర్టులో జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు 35 వేల జీతం పొందొచ్చు.

AP High Court Recruitment 2024: గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? పరీక్ష లేకుండానే హైకోర్టులో జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు 35 వేల జీతం పొందొచ్చు.

హైకోర్టులో లా క్లర్క్ ఉద్యోగాలు.. నెలకు 35 వేల జీతం.. అర్హులు వీరే

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి. మీరు కూడా జాబ్ కోసం ట్రై చేస్తున్నట్లైతే రాత పరీక్ష లేకుండానే హైకోర్టులో ఉద్యోగం పొందే ఛాన్స్ వచ్చింది. ఈ క్వాలిఫికేషన్ ఉన్నట్లైతే చాలు హైకోర్టులో లా క్లర్క్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు 35 వేల జీతం పొందొచ్చు. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు. వెంటనే అప్లై చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లా క్లర్క్ జాబ్స్ భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఏపీ హైకోర్టు 12 లా క్లర్క్ పోస్టులను భర్తీ చేయనున్నది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నది. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టభద్రులై ఉండాలి. ఏపీతో పాటు ఏ రాష్ట్ర హైకోర్టు బార్ కౌన్సిల్ లోను అడ్వకేట్ గా నమోదై ఉండకూడదు. అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తును ది రిజిస్ట్రార్ (రిక్రూట్‌మెంట్‌), ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు, అమ‌రావ‌తి, నేల‌పాడు, గుంటూరు జిల్లా, ఏపీ- 522239 అడ్ర‌స్‌కు ఆగ‌స్టు 6 తేదీ సాయంత్రం 5 గంట‌లలోపు పంపాలి. అభ్యర్థుల వయసు 30 ఏళ్లు మించకూడదు. ఈ ఉద్యోగాలకు విద్యార్హ‌త‌, ఇంట‌ర్వ్యూ, స‌ర్టిఫికేట్ వెరిఫికేష‌న్ త‌దిత‌రాల ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

లా క్లర్క్ పోస్టులు: 12

అర్హత:

  • న్యాయశాస్త్రంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి ఏ రాష్ట్ర బార్ కౌన్సిల్‌లోనూ అడ్వకేట్‌గా నమోదు చేసుకుని ఉండకూడదు.

వయోపరిమితి:

  • అభ్యర్థుల వయసు 30 ఏళ్లు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ:

  • విద్యార్హత, వైవా వోస్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతం:

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ.35,000గా ఉంటుంది.

దరఖాస్తు విధానం:

  • ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ద‌ర‌ఖాస్తును ది రిజిస్ట్రార్ (రిక్రూట్‌మెంట్‌), ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు, అమ‌రావ‌తి, నేల‌పాడు, గుంటూరు జిల్లా, ఏపీ- 522239 అడ్ర‌స్‌కు ఆగ‌స్టు 6 తేదీ సాయంత్రం 5 గంట‌లలోపు పంపాలి.

దరఖాస్తులకు చివరి తేదీ:

  • 06-08-2024

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి