iDreamPost
android-app
ios-app

పోలీస్ జాబ్ మీ లక్ష్యమా? డిగ్రీ పాసైతే చాలు.. హెడ్ కానిస్టేబుల్ Jobs మీకోసమే

  • Published Jul 15, 2024 | 3:22 PM Updated Updated Jul 15, 2024 | 3:22 PM

ITBP Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. డిగ్రీ పాసైతే చాలు హెడ్ కానిస్టేబుల్ జాబ్ పొందే ఛాన్స్. పోలీస్ జాబ్ మీ లక్ష్యమైతే ఈ అవకాశాన్ని వదులుకోకండి. నెలకు 81 వేల వరకు జీతం అందుకోవచ్చు.

ITBP Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. డిగ్రీ పాసైతే చాలు హెడ్ కానిస్టేబుల్ జాబ్ పొందే ఛాన్స్. పోలీస్ జాబ్ మీ లక్ష్యమైతే ఈ అవకాశాన్ని వదులుకోకండి. నెలకు 81 వేల వరకు జీతం అందుకోవచ్చు.

  • Published Jul 15, 2024 | 3:22 PMUpdated Jul 15, 2024 | 3:22 PM
పోలీస్ జాబ్ మీ లక్ష్యమా? డిగ్రీ పాసైతే చాలు.. హెడ్ కానిస్టేబుల్ Jobs మీకోసమే

పోలీస్ జాబ్స్ కు యూత్ లో ఉండే క్రేజ్ వేరు. యూనిఫాం ఉద్యోగాల కోసం పరితపిస్తుంటారు. పోలీస్ ఉద్యోగాలు సాధించేందుకు అలుపెరుగని పోరాటం చేస్తుంటారు. ఏళ్ల తరబడి సన్నద్ధమవుతుంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే పోలీస్ జాబ్స్ కోసం ఎదురుచూస్తుంటారు. మరి మీరు కూడా పోలీస్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? పోలీస్ జాబ్ అంటే మీకు ఇష్టమా? అయితే మీకు గుడ్ న్యూస్. మీరు డిగ్రీ అర్హతతో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగం పొందే ఛాన్స్ వచ్చింది. ఇటీవల ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ నుంచి పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది.

ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(ఐటీబీపీ) గ్రూప్-సి (నాన్‌ గెజిటెడ్‌, నాన్‌ మినిస్టీరియల్‌) విభాగంలో హెడ్ కానిస్టేబుల్ (ఎడ్యుకేషన్ అండ్ స్ట్రెస్ కౌన్సెలర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 112 పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ(సైకాలజీ) లేదా డిగ్రీ, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణత ఉన్నవారు ఈ పోస్టులకు అర్హులు. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌ విధానంలో ఆగస్టు 5 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు నెలకు 81 వేల వరకు జీతం అందుకవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

ఖాళీల సంఖ్య: 112

  • హెడ్ ​​కానిస్టేబుల్(ఎడ్యుకేషన్ అండ్ స్ట్రెస్ కౌన్సెలర్)

అర్హత:

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ(సైకాలజీ) లేదా తత్సమానం లేదా డిగ్రీ, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదా బ్యాచిలర్ ఆఫ్ టీచింగ్ లేదా తత్సమానం కలిగి ఉండాలి.

వయోపరిమితి:

  • 05.08.2024 నాటికి 20 – 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆయా కేటగిరీ వర్గాల వారికి వయోసడలింపు నిబంధనలు వర్తిస్తాయి.

దరఖాస్తు ఫీజు:

  • రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్- సర్వీస్‌మెన్, మహిళలకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ లైన్

ఎంపిక విధానం:

  • ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ టెస్టు ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతం:

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ.25,500 – రూ.81,100 అందిస్తారు.

దరఖాస్తులు ప్రారంభ తేదీ:

  • 07-07-2024

దరఖాస్తుకు చివరి తేదీ:

  • 05-08-2024

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetMadridbetMadridbetMadridbetjojobetJojobetBetsmovefixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş