India post recruitment 2024టెన్త్ పాసైతే చాలు.. నెలకు రూ. 63,200 జీతంతో పోస్టల్ శాఖలో ఉద్యోగాలు

టెన్త్ పాసైతే చాలు.. నెలకు రూ. 63,200 జీతంతో పోస్టల్ శాఖలో ఉద్యోగాలు

ఉద్యోగాల కోసం ఎదురు చూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. పదో తరగతి అర్హతతో పోస్టల్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 63200 జీతాన్ని అందిస్తారు.

ఉద్యోగాల కోసం ఎదురు చూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. పదో తరగతి అర్హతతో పోస్టల్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 63200 జీతాన్ని అందిస్తారు.

మీరు టెన్త్ ఉత్తీర్ణులై ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నట్లైతే మీకు భారీ శుభవార్త. భారీ వేతనంతో పోస్టల్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోని జాబ్ కొట్టండి జీవితంలో స్థిరపడండి. పోస్టల్ డిపార్ట్ మెంట్ నిత్యం దేశంలోని ఏదోఒక సర్కిల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఉంటుంది. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ సర్కిల్ డ్రైవర్(ఆర్డినరీ గ్రేడ్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 78 పోస్టులను భర్తీ చేయనున్నారు.

అయితే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి అర్హతతో పాటు డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు మూడేళ్ల పని అనుభవం, మోటార్ మెకానిజంపై పరిజ్ఞానం కలిగి ఉండాలి. అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరీ 02 2024 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. పూర్తి సమాచారం కోసం పోస్టల్ శాఖ అధికారిక వెబ్ సైట్ ను https://www.indiapost.gov.in/ పరీశీలించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన సమాచారం:

  • డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) మొత్తం పోస్టులు:
  • 78

రీజియన్/డివిజన్ వారీగా ఖాళీలు:

  • ఆగ్రా: 07
  • అలీగర్: 03
  • బులంద్‌షహర్: 01
  • ఎటాహ్: 01
  • ఝాన్సీ: 01
  • మెయిన్‌పురి:
  • 01మధుర: 01
  • ఆర్ఓ ఆగ్రా: 01
  • మిర్జాపూర్: 01
  • ప్రతాప్‌ఘర్: 01
  • ప్రయాగ్ రాజ్: 01
  • సుల్తాన్‌పూర్: 01
  • బరేలీ: 01
  • బిజ్నోర్: 01
  • బుడౌన్: 01
  • బాగ్పట్: 01
  • హార్డోయ్: 01
  • ఖేరీ: 01
  • మీరట్: 04
  • మొరాదాబాద్: 01
  • ముజఫర్‌నగర్: 01
  • సహరన్పూర్: 03
  • అజాంఘర్: 03
  • బరైచ్: 01
  • బస్తీ: 01
  • గోండా: 01
  • ఆర్ ఓ గోరఖ్‌పూర్: 01
  • బాండా: 01
  • బాండా: 01
  • ఫతేహ్‌ఘర్: 01
  • ఎంఎంఎస్ కాన్పూర్: 12
  • అయోధ్య: 01
  • బారాబంకి: 01
  • లక్నో: 01
  • రాయబరేలీ: 01
  • సీతాపూర్: 01
  • బలియా: 01
  • ఘాజీపూర్: 01
  • జాన్పూర్: 01
  • వారణాసి: 10
  • గజియాబాద్: 02
  • సర్కిల్ ఆఫీస్: 01

అర్హత:

  • అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు మూడేళ్ల పని అనుభవం, మోటార్ మెకానిజంపై పరిజ్ఞానం కలిగి ఉండాలి.

వయోపరిమితి:

  • 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు ఫీజు:

  • రూ.100.

దరఖాస్తు విధానం:

  • ఆన్ లైన్‌

ఎంపిక విధానం:

  • రాత పరీక్ష, డ్రైవింగ్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, థియరీ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

జీతం:

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.19,900 – రూ.63,200.

దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:

The Manager(GR.A),
Mail Motor Service Kanpur,
GPO Compound, Kanpur – 208001,
Uttar Pradesh.

దరఖాస్తుకు చివరితేది:

  • 16-02-2024.

పోస్టల్ శాఖ అధికారిక వెబ్ సైట్:

https://www.indiapost.gov.in/

Show comments