APలోని ఆ శాఖలో ఉద్యోగాలు.. కాంపిటీషన్ తక్కువ.. ఈ అర్హతలుంటే చాలు జాబ్ పక్కా

ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఆ శాఖలో పలు ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. పోటీ తక్కువగా ఉండే ఈ ఉద్యోగాలకు ఈ అర్హతలున్న వారు అప్లై చేసుకుని జాబ్ కొట్టొచ్చు.

ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఆ శాఖలో పలు ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. పోటీ తక్కువగా ఉండే ఈ ఉద్యోగాలకు ఈ అర్హతలున్న వారు అప్లై చేసుకుని జాబ్ కొట్టొచ్చు.

ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇటీవల రాష్ట్రంలో గ్రూప్ 1,2 తో పాటుగా డీఎస్సీకి సంబంధించిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఆశావాహులు ఈసారి ఎలాగైనా జాబ్ కొట్టాలనే కసితో పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఏపీలో ఆ శాఖ నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ప్రభుత్వ ఉద్యోగాలే లక్ష్యంగా సన్నద్ధమయ్యే వారికి ఇది గోల్డెన్ ఛాన్స్. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పలు ఉద్యోగాల భర్తీకి డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగాలకు కాంపిటీషన్ తక్కువగానే ఉంటుంది. ఈ అర్హతలున్న వారు అప్లై చేసుకోవచ్చు.

ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్ట్ ఎంట్రీ, లేటరల్ ఎంట్రీ ద్వారా కొత్తగా ఏర్పాటుచేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 29 పోస్టులను భర్తీచేయనున్నారు. ఈ ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థులు మెడికల్‌ పీజీ డిగ్రీ, పీహెచ్ డీ అర్హతతోపాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అర్హత, ఆసక్తి ఉన్నవారు మే 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు అకడమిక్ మెరిట్, పని అనుభవం, రూల్ ఆఫ్‌ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీల సంఖ్య:

  • 29.

విభాగాలా వారీగా ఖాళీలు:

  • మైక్రోబయాలజీ: 07
  • ఫార్మకాలజీ: 06
  • అనాటమీ: 03
  • బయోకెమిస్ట్రీ: 06
  • ఫిజియాలజీ: 07

అర్హతలు:

  • మైక్రోబయాలజీ అండ్‌ ఫార్మకాలజీ విభాగానికి పీజీ డిగ్రీ(ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ/డీఎం) ఉత్తీర్ణులై ఉండాలి.
  • అనాటమీ విభాగానికి ఎండీ/ఎంఎస్ (అనాటమీ) లేదా ఎంఎస్సీ(మెడికల్ అనాటమీ) తోపాటు పీహెచ్‌డీ (మెడికల్ అనాటమీ)/ ఎంఎస్సీ (మెడికల్ అనాటమీ)తోపాటు డీఎస్సీ (మెడికల్ అనాటమీ) పాసై ఉండాలి.
  • బయోకెమిస్ట్రీ విభాగానికి ఎండీ (బయోకెమిస్ట్రీ) లేదా ఎంఎస్సీ (మెడికల్ బయోకెమిస్ట్రీ)తోపాటు పీహెచ్‌డీ (మెడికల్ బయోకెమిస్ట్రీ)/ ఎంఎస్సీ(మెడికల్ బయోకెమిస్ట్రీ)తోపాటు డీఎస్సీ (మెడికల్ బయోకెమిస్ట్రీ) పాసై ఉండాలి.
  • ఫిజియాలజీ విభాగానికి ఎండీ (ఫిజియాలజీ) లేదా ఎంఎస్సీ (మెడికల్ ఫిజియాలజీ)తోపాటు పీహెచ్‌డీ (మెడికల్ ఫిజియాలజీ)/ ఎంఎస్సీ(మెడికల్ ఫిజియాలజీ)తోపాటు డీఎస్సీ (మెడికల్ ఫిజియాలజీ) పాసై ఉండాలి.

వయోపరిమితి:

  • జనరల్ అభ్యర్థులు 42 సంవత్సరాలకు మించకూడదు. 01.07.1981 తర్వాత జన్మించి ఉండాలి.
  • ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు 47 సంవత్సరాలలోపు ఉండాలి. 01.07.1976 తర్వాత జన్మించి ఉండాలి.
  • దివ్యాంగ అభ్యర్థులు 52 సంవత్సరాలలోపు ఉండాలి. 01.07.1971 తర్వాత జన్మించి ఉండాలి.
  • ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు 50 సంవత్సరాలలోపు ఉండాలి. 01.07.1973 తర్వాత జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం:

  • అకడమిక్ మెరిట్, పని అనుభవం, రూల్ ఆఫ్‌ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు:

  • అభ్యర్థులు రూ.1000 చెల్లించాలి. బీసీ, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్, ఎస్టీ, దివ్యాంగులు రూ.500 చెల్లించాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:

  • 18-05-2024

దరఖాస్తుకు చివరితేదీ:

  • 27-05-2024
Show comments