iDreamPost
android-app
ios-app

మళ్లీ రాని ఛాన్స్.. రైల్వేలో 4,096 జాబ్స్.. రాత పరీక్ష లేదు

  • Published Sep 01, 2024 | 10:51 AM Updated Updated Sep 01, 2024 | 10:51 AM

RRC NR Apprentice Recruitment 2024: రైల్వే ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నారా? అయితే ఈ జాబ్స్ మీకోసమే. రైల్వేలో 4096 జాబ్స్ సిద్ధంగా ఉన్నాయి. త్వరగా అప్లై చేసుకోండి.

RRC NR Apprentice Recruitment 2024: రైల్వే ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నారా? అయితే ఈ జాబ్స్ మీకోసమే. రైల్వేలో 4096 జాబ్స్ సిద్ధంగా ఉన్నాయి. త్వరగా అప్లై చేసుకోండి.

  • Published Sep 01, 2024 | 10:51 AMUpdated Sep 01, 2024 | 10:51 AM
మళ్లీ రాని ఛాన్స్.. రైల్వేలో 4,096 జాబ్స్.. రాత పరీక్ష లేదు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి గుడ్ న్యూస్. భారతీయ రైల్వేలో జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. ఈ అవకాశాన్ని వదులుకోకండి. ఇటీవల వివిధ రైల్వే రీజియన్ల నుంచి భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి. రైల్వే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వారికి ఇదే మంచి ఛాన్స్. రాత పరీక్ష లేకుండానే జాబ్ కొట్టే ఛాన్స్ వచ్చింది. నార్త్ రైల్వే భారీ స్థాయిలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రెడీ అవుతోంది. ఏకంగా 4096 జాబ్స్ భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వెంటనే అప్లై చేసుకోండి. ఈ పోస్టులకు అర్హులు ఎవరు? వయోపరిమితి ఎంత? ఎంపిక ఎలా చేస్తారు? ఆ వివరాల్లోకి వెళ్తే..

ఢిల్లీలోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నార్త్ రైల్వే పరిధిలోని డివిజన్, వర్క్ షాప్ యూనిట్లలో యాక్ట్ అప్రెంటిస్ శిక్షణ కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తు కోరుతోంది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 4,096 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. టెన్త్, ఐటీఐ పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి రాత పరీక్ష లేదు. టెన్త్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు సెప్టెంబర్ 16 వరకు అప్లై చేసుకోవచ్చు. 15 నుంచి 24 ఏళ్ల వయసు కలిగి ఉండాలి. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం :

మొత్తం యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలు:

  • 4,096

అర్హత:

  • టెన్త్ అర్హతతో పాటు సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ పాసై ఉండాలి.

వయో పరిమితి:

  • 16.09.2024 నాటికి 15 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం:

  • టెన్త్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు:

  • అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం :

  • ఆన్‌ లైన్‌

దరఖాస్తులకు చివరి తేదీ:

  • 16-09-2024

Jojobet GirişjojobetMadridbetMadridbetJojobetJojobetjojobetJojobetlunabetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet