iDreamPost
android-app
ios-app

10th,ITI పాసైతే చాలు?.. రైల్వేలో 1104 జాబ్స్ మీవే.. ఒక్కరోజే ఛాన్స్

North Eastern Railway recruitment 2024: రైల్వేలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ ఛాన్స్ వదలకండి. రైల్వేలో 1104 పొస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. రేపు ఒక్కరోజే అప్లై చేసుకునేందుకు అవకాశం ఉంది. వెంటనే అప్లై చేసుకోండి.

North Eastern Railway recruitment 2024: రైల్వేలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ ఛాన్స్ వదలకండి. రైల్వేలో 1104 పొస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. రేపు ఒక్కరోజే అప్లై చేసుకునేందుకు అవకాశం ఉంది. వెంటనే అప్లై చేసుకోండి.

10th,ITI పాసైతే చాలు?.. రైల్వేలో 1104 జాబ్స్ మీవే.. ఒక్కరోజే ఛాన్స్

మీరు టెన్త్, ఐటీఐ పాసై ఖాళీగా ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఇటీవల రైల్వే డిపార్ట్ మెంట్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. భారీ స్థాయిలో రైల్వేలో జాబ్స్ భర్తీ కానున్నాయి. మరి మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నట్లైతే ఇదే మంచి ఛాన్స్. పదోతరగతి, ఐటీఐ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను పొందే ఛాన్స్ వచ్చింది. ఇటీవల నార్త్ ఈస్టర్న్ రైల్వే నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు రేపు ఒక్కరోజు మాత్రమే ఛాన్స్ ఉంది. వెంటనే అప్లై చేసుకోండి.

గోరఖ్ పూర్ లోని రైల్వే రిక్రూట్ మెంట్ సెల్.. నార్త్ ఈస్టర్న్ రైల్వే.. ఎన్ఈఆర్ పరిధిలోని యూనిట్లలో అప్రెంటిస్ షిప్ శిక్షణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 1104 పోస్టులను భర్తీ చేయనున్నారు.టెన్త్, ఐటీఐ పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు 15 నుంచి 24 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు. టెన్త్, ఐటీఐ పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత, ఆసక్తి ఉన్న వారు 11-07-2024 వరకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

ఖాళీల వివరాలు:

యాక్ట్ అప్రెంటిస్:

  • 1104

వర్క్ షాప్ వారీగా ఖాళీల వివరాలు:

  • మెకానికల్ వర్క్ షాప్(గోరఖ్ పూర్)411, సిగ్నల్ వర్క్ షాప్(గోరఖ్ పూర్ కంటోన్మెంట్)63, బ్రిడ్జ్ వర్క్ షాప్(గోరఖ్ పూర్ కంటోన్మెంట్)35, మెకానికల్ వర్క్ షాప్(ఇజ్జత్ నగర్)151, డిజీల్ షెడ్(ఇజ్జత్ నగర్)60, క్యారేజ్ అండ్ వ్యాగన్ (ఇజ్జత్ నగర్)64,క్యారేజ్ అండ్ వ్యాగన్ (లఖ్ నవూ జంక్షన్)155, డీజిల్ షెడ్(గోండా)90, క్యారేజ్ అండ్ వ్యాగన్(వారణాసి)75.

ట్రేడ్:

  • ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, పెయింటర్, మెషినిస్ట్, టర్నర్, మెకానికల్ డీజిల్, ట్రిమ్మర్.

అర్హత:

  • 50 శాతం మార్కులతో టెన్త్, సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ పాసై ఉండాలి.

వయోపరిమితి:

  • 15 నుంచి 24 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి.

ట్రైనింగ్ పిరియడ్:

  • సంవత్సరం పాటు ఉంటుంది.

ఎంపిక విధానం:

  • టెన్త్, ఐటీఐ పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు:

  • రూ. 100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈడబ్య్లూఎస్, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపునిచ్చారు.

దరఖాస్తుకు చివరి తేదీ:

  • 11-07-2024