టెన్త్ అర్హతతో డ్రైవర్ పోస్టులు.. త్వరగా అప్లై చేసుకోండి!

డ్రైవర్ ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాల్లో డ్రైవర్ల నియామకం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. పదో తరగతి అర్హతతో అప్లై చేసుకోవచ్చు.

డ్రైవర్ ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాల్లో డ్రైవర్ల నియామకం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. పదో తరగతి అర్హతతో అప్లై చేసుకోవచ్చు.

డ్రైవింగ్ ను వృత్తిగా ఎంచుకుని డ్రైవర్ ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి గుడ్ న్యూస్. కేవలం పదోతరగతి అర్హతతోనే డ్రైవర్ పోస్టులను దక్కించుకునే అవకాశం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాలల్లో డ్రైవర్ల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవానంతరం తల్లీబిడ్డలను సురక్షితంగా ఇంటికి చేర్చుటకు డాక్టర్ వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడ చిత్రూరు జిల్లాలో ఇదే వాహనాల్లో ఖాళీగా ఉన్న 104,108 డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసుకొవాలని జిల్లా 104,108 జిల్లా మేనేజర్ ప్రతాప్ తెలిపారు.

ఏపీ ప్రభుత్వం పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి అద్భుతమైన పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోంది. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా వైద్యులే ప్రజల వద్దకు వెళ్లి పలు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను అందిస్తున్నారు. అదే విధంగా ప్రసవ సమయంలో అండగా ఉండేందుకు తల్లీ బిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాలను కూడా ప్రవేశపెట్టింది జగన్ సర్కార్. ఈ క్రమంలోనే చిత్తూరులో ఉన్న డ్రైవర్ పోస్టులను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతున్నారు. చిత్తూరు జిల్లాలోని కార్వేటు నగరం, పుత్తూరు, పలమనేరు, శాంతిపురం, విజయ పురం గల పట్టణాల్లో ఉన్నటువంటి నిర్యుదోగ యువకులకు102,104,108 వాహనాల్లో డ్రైవర్ పోస్టులను పొందే అవకాశం కల్పిస్తున్నారు.

ముఖ్యమైన సమాచారం:

108 వాహనాల్లో డ్రైవర్ పోస్టుల వివరాలు:

  • శాంతిపురం 1, నిండ్ర 1.

104 వాహనాల్లో డ్రైవర్ పోస్టుల వివరాలు:

  • పుంగనూరులో 1 పోస్టు ఉన్నది.

102 వాహనాల్లో డ్రైవర్ పోస్టుల వివరాలు:

  • చిత్తూరు పట్టణానికి 3, కార్వేటు నగరానికి 1, పలమనేరు 1.

విద్యార్హత:

  • 10వ తరగతి ఉత్తిర్ణులై ఉండాలి.

వయసు:

  • అభ్యర్థులు 18 సంవత్సరాల పైబడి 35 సంవత్సరాల లోపు ఉండాలి.

వాహనం నడిపేందుకు అర్హతలు:

  • అభ్యర్థులు హెవీ లైసెన్స్, బ్యాడ్జ్ కలిగి ఉండాలి. మూడు సంవత్సరాలు డ్రైవింగ్ నందు అనుభవం తప్పనిసరి.

జీతం :

  • 108 వాహనాలకు ఎంపికైన వారికి 18 వేలు శాలరీ. కటింగ్స్ పోయి చేతికి 15 వేలు వస్తుందని తెలిపారు. 102,104 వాహనాల్లో పని చేయు వారికి 12 వేలు పై చిలుకు వస్తుందన్నారు.

దరఖాస్తు విధానం:

  • అభ్యర్థులు చిత్తూరు పట్టణంలో గల ప్రభుత్వ ఆసుపత్రిలోని 104,108 కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించాలి.

దరఖాస్తులకు చివరి తేదీ:

  • 29-11-2023
Show comments