iDreamPost
android-app
ios-app

టెట్ అర్హత సాధించని వారికి గుడ్ న్యూస్.. సీటెట్ కోసం దరఖాస్తుల ఆహ్వానం

  • Published Nov 04, 2023 | 8:39 PM Updated Updated Nov 04, 2023 | 8:39 PM

సీటెట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నవంబరు 23 2023వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

సీటెట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నవంబరు 23 2023వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

  • Published Nov 04, 2023 | 8:39 PMUpdated Nov 04, 2023 | 8:39 PM
టెట్ అర్హత సాధించని వారికి గుడ్ న్యూస్.. సీటెట్ కోసం దరఖాస్తుల ఆహ్వానం

ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్న వారు టీచర్ పోస్టులకు పోటీపడాలంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్టులో క్వాలిఫై కావడం తప్పని సరి చేశాయి ప్రభుత్వాలు. రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో టెట్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో టెట్ అర్హత సాధించని వారికి మరో అవకావం కల్పిస్తోంది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఈ క్రమంలోనే సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌- జనవరి 2024 కోసం నోటిఫికేషన్‌‌ విడుదలైంది. కాగా సీటెట్ ను ఏడాదికి రెండు పర్యాయాలు నిర్వహిస్తోంది సీబీఎస్ఈ. సీటెట్ కు అప్లై చేసుకునేందుకు అర్హతలు ఏంటి? ఫీజు ఎంత వంటి వివరాలు ఇప్పుడు తెలుససుకుందాం.

సీటెట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నవంబరు 23 2023వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఫీజు చెల్లించడానికి చివరితేది23.11.2023కాగా, పరీక్ష తేదీ 21.01.2024.గా ప్రకటించారు. కాగా కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-I- 1 నుండి 5వ తరగతి వరకు గల ఉపాధ్యాయ పోస్టుల కోసం నిర్వహించబడుతుంది. పేపర్-II- 6 నుండి 12వ తరగతి వరకు గల ఉపాధ్యాయ పోస్టుల కోసం నిర్వహించబడుతుంది. సీటెట్ లో అర్హత సాధించాలంటే కనీసం 60 శాతం మార్కులు సాధించాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించాలంటే 55 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. సీటెట్ లో సాధించిన స్కోరుకు లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఉంటుంది.

ప్రైమరీ స్టేజ్ (పీఆర్‌టీ), ఎలిమెంటరీ స్టేజ్ (టీజీటీ) వేరు వేరుగా పేపర్ 1, పేపరు 2 పరీక్షలు నిర్వహిస్తారు. దరఖాస్తు చేసుకునే వారి అర్హతల విషయానికి వస్తే ప్రైమరీ స్టేజ్ అభ్యర్ధులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో డిగ్రీతోపాటు బీఈడీ లేదా ఇంటర్‌తోపాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్/ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ లో డిప్లొమా లేదా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ లేదా డిగ్రీతోపాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎలిమెంటరీ స్టేజ్ (టీజీటీ) అభ్యర్ధులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో డిగ్రీతో పాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా/బీఈడీ లేదా 50 శాతం మార్కులతో ఇంటర్‌తోపాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ లేదా నాలుగేండ్ల బీఏ/బీఎస్సీ ఎడ్యుకేషన్, బీఏఈడీ, బీఎస్‌ఈడీ, డిగ్రీతోపాటు బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అప్లికేషన్ ఫీజు.. జనరల్, ఓబీసీ అభ్యర్థులు పేపర్-1 లేదా పేపర్-2 రూ.1000 చెల్లించాలి. రెండు పేపర్లకు దరఖాస్తు చేసుకునేవారు రూ.1200 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు పేపర్-1 లేదా పేపర్-2 కు రూ.500; రెండు పేపర్లకు అయితే రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్  https://ctet.nic.in/ను సందర్శించి మరింత సమాచారం పొందొచ్చు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss