iDreamPost
android-app
ios-app

మీరు అప్లై చేశారా? డిగ్రీ అర్హతతో 1500 Bank జాబ్స్.. రెండు రోజులే ఛాన్స్

  • Published Jul 29, 2024 | 7:16 PM Updated Updated Jul 29, 2024 | 7:16 PM

Indian Bank Recruitment 2024: మీరు డిగ్రీ పాసై ఖాళీగా ఉన్నారా? అయితే ఈ బ్యాంక్ జాబ్స్ కోసం ఇప్పుడే అప్లై చేసుకోండి. 1500 బ్యాంక్ ఉద్యోగాలకు మరో రెండు రోజుల్లో దరఖాస్తు ముగియనున్నది.

Indian Bank Recruitment 2024: మీరు డిగ్రీ పాసై ఖాళీగా ఉన్నారా? అయితే ఈ బ్యాంక్ జాబ్స్ కోసం ఇప్పుడే అప్లై చేసుకోండి. 1500 బ్యాంక్ ఉద్యోగాలకు మరో రెండు రోజుల్లో దరఖాస్తు ముగియనున్నది.

  • Published Jul 29, 2024 | 7:16 PMUpdated Jul 29, 2024 | 7:16 PM
మీరు అప్లై చేశారా? డిగ్రీ అర్హతతో 1500 Bank జాబ్స్.. రెండు రోజులే ఛాన్స్

ఉద్యోగం లేదని చింతిస్తున్నారా? అయితే మీకు ఇదే మంచి ఛాన్స్. డిగ్రీ అర్హతతో బ్యాంక్ జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. ప్రముఖ బ్యాంక్ పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. బ్యాంక్ జాబ్ లక్ష్యంగా సన్నద్ధమయ్యే వారు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. బ్యాంక్ జాబ్స్ కోసం ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతుంటారు. బ్యాంక్ జాబ్ సాధించడమే మీ కళ అయితే ఇప్పుడే అప్లై చేసుకోండి. 1500 జాబ్స్ కు రెండు రోజుల్లో దరఖాస్తు ముగియనున్నది. ఇండియన్ బ్యాంక్ ఇటీవల 1500 బ్యాంక్ జాబ్స్ భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

ఇండియన్ బ్యాంక్ దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 1500 ఉద్యోగాలను భర్తీ చేయనున్నది. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ పాసై ఉండాలి. 01-07-2024 నాటికి అభ్యర్థుల వయసు 20-28 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఆన్ లైన్ రాతపరీక్ష, లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హత, ఆసక్తి ఉన్న వారు జులై 31 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం పోస్టులు: 1500

తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు:

  • ఏపీలో 82, తెలంగాణలో 42.

అర్హత:

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ పాసై ఉండాలి.

వయోపరిమితి:

  • 01-07-2024 నాటికి అభ్యర్థుల వయసు 20-28 ఏళ్ల మధ్య ఉండాలి.

ట్రైనింగ్ పిరియడ్:

  • ఏడాది

ఎంపిక విధానం:

  • ఆన్ లైన్ రాతపరీక్ష, లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

స్టైఫండ్:

  • నెలకు మెట్రో/అర్భన్ శాఖల్లో రూ. 15 వేలు, గ్రామీణ/ సెమీ అర్భన్ శాఖల్లో రూ. 12 వేలు అందిస్తారు.

దరఖాస్తు ఫీజు:

  • జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ. 500 ఎస్టీ, ఎస్సీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తుల ప్రారంభ తేదీ:

  • 10-07-2024

దరఖాస్తుకు చివరి తేదీ:

  • 31-07-2024

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetjojobet girişdeneme bonusu veren sitelerMariobetmadridbetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetcasibomcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet