iDreamPost
android-app
ios-app

టెన్త్ పాసైతే చాలు.. రూ.63 వేల జీతంతో AP ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌లో Jobs

  • Published Jan 19, 2024 | 3:15 PM Updated Updated Jan 19, 2024 | 3:15 PM

మీరు టెన్త్ ఉత్తీర్ణులయ్యారా? అయితే మీకు ఓ గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 63 వేల జీతం అందిస్తారు.

మీరు టెన్త్ ఉత్తీర్ణులయ్యారా? అయితే మీకు ఓ గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 63 వేల జీతం అందిస్తారు.

  • Published Jan 19, 2024 | 3:15 PMUpdated Jan 19, 2024 | 3:15 PM
టెన్త్ పాసైతే చాలు.. రూ.63 వేల జీతంతో AP ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌లో Jobs

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా భారీగా ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్స్ ను విడుదల చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు ఈ అవకాశం మళ్లీ రాదు. ఇప్పటికే పలు ఉద్యోగాలకు అప్లికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో మరో నోటిఫికేషన్ విడుదలైంది. కేవలం పదోతరగతి అర్హతతో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే ఏకంగా నెలకు రూ. 63 వేల జీతం అందిస్తారు. తాజాగా హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(ఏపీఈఆర్‌సీ) ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 06 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు తెలుగు, ఇంగ్లిష్‌ చదవడం, రాయడం, ఫిజికల్ ఫిట్ నెస్, టూ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జనవరి 24 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం ఏపీఈఆర్‌సీ అధికారిక వెబ్ సైట్ ను https://aperc.gov.in/page/Careers పరిశీలించాలి.

ముఖ్యమైన సమాచారం:

ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల సంఖ్య:

  • 06

అర్హత:

  • అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు తెలుగు, ఇంగ్లిష్‌ చదవడం, రాయడం, టూ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

వయోపరిమితి:

  • అభ్యర్థులు 21 – 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.

దరఖాస్తు ఫీజు:

  • అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

దరఖాస్తు విధానం:

  • ఆఫ్‌ లైన్‌

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:

  • కమిషన్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్, రెడ్ హిల్స్, ఖైరతాబాద్, హైదరాబాద్.

జీతం:

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ.20,600 నుంచి రూ.63,660.

దరఖాస్తుకు చివరితేదీ:

  • 24-01-2024.

ఏపీఈఆర్‌సీ అధికారిక వెబ్ సైట్ :

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetstarzbetstarzbetStarzbetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş