iDreamPost
android-app
ios-app

మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలో అంగన్‌వాడీ కేంద్రాల్లో 9 వేల పోస్టుల భర్తీ!

  • Published Feb 06, 2024 | 3:35 PM Updated Updated Feb 06, 2024 | 3:35 PM

రాష్ట్రంలోని నిరుద్యోగ మహిళలకు భారీ శుభవార్త. త్వరలోనే అంగన్ వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 9 వేల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి.

రాష్ట్రంలోని నిరుద్యోగ మహిళలకు భారీ శుభవార్త. త్వరలోనే అంగన్ వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 9 వేల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి.

  • Published Feb 06, 2024 | 3:35 PMUpdated Feb 06, 2024 | 3:35 PM
మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలో అంగన్‌వాడీ కేంద్రాల్లో 9 వేల పోస్టుల భర్తీ!

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై దృష్టిసారించింది. దీనిలో భాగంగానే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ శాఖలో దాదాపు 15వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. అదే విధంగా నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని వెల్లడించారు. మరోవైపు గ్రూప్ 1 నోటిఫికేషన్, డీఎస్సీ అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్ వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు రెడీ అవుతోంది. ఏకంగా 9 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు.

రాష్ట్రంలోని మహిళలకు తెలంగాణ సర్కార్ శుభవార్తను అందించనుంది. త్వరలోనే అంగన్ వాడీ కేంద్రాల్లో 9 వేలకు పైగా పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అంగన్ వాడీల నియామకానికి ప్రక్రియను ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల పోస్టుల నియామకాలు చేపట్టాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఇక భారీ సంఖ్యలో అంగన్ వాడీ ఖాళీలను భర్తీ చేయనుండడంతో నిరుద్యోగ మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అనుమతిచ్చిన వెంటనే జిల్లాల వారీగా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగ ప్రకటనలు జారీ కానున్నాయి.

గతంలో అంగన్వాడీ టీచర్ పోస్టులకు కనీసం పదోతరగతి పాసై ఉండాలన్న నిబంధన ఉండేది. తాజా మార్గదర్శకాల ప్రకారం అంగన్ వాడీ టీచర్‌తో పాటు హెల్పర్లుగా నియమితులయ్యేవారు కనీసం ఇంటర్ పాసై ఉండాలి. విద్యార్హత మార్కులు, స్థానికత, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క ఇటీవల అంగన్ వాడీలల్లో ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో 4 వేల మినీ అంగన్‌వాడీ కేంద్రాలను అప్‌గ్రేడ్‌ చేసి అంగన్‌వాడీ కేంద్రాలుగా మార్చినట్లు స్పష్టం చేశారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş