iDreamPost
android-app
ios-app

ఇంటర్ పాసై ఇంట్లో ఖాళీగా ఉన్నరా.. అయితే IT రంగంలో గోల్డెన్ ఛాన్స్

  • Published Jun 15, 2024 | 1:16 PM Updated Updated Jun 15, 2024 | 1:20 PM

ఇప్పటి వరకు ఇంటర్మీడియట్ పాసై ఇంట్లోనే ఏ జాబ్ లేక ఖాళీగా ఉన్నాం అని బాధపడుతున్నారా.. కానీ, ఇకపై ఆ చింత అవసరం లేదు. ఎందుకంటే.. ఇప్పుడు ఇంటర్ పాసై ఇంట్లోనే ఖాలీగా ఉన్నవారు ప్రభుత్వ ఉద్యోగాలకే పరిమితం కాదు ప్రవైట్ ఉద్యోగం కూడా చేయవచ్చంటూ ఓ ప్రముఖ దిగ్గజ కంపెనీ బంఫర్ ఆఫర్ ను ప్రకటించింది. ఇంతకి ఏమిటంటే..

ఇప్పటి వరకు ఇంటర్మీడియట్ పాసై ఇంట్లోనే ఏ జాబ్ లేక ఖాళీగా ఉన్నాం అని బాధపడుతున్నారా.. కానీ, ఇకపై ఆ చింత అవసరం లేదు. ఎందుకంటే.. ఇప్పుడు ఇంటర్ పాసై ఇంట్లోనే ఖాలీగా ఉన్నవారు ప్రభుత్వ ఉద్యోగాలకే పరిమితం కాదు ప్రవైట్ ఉద్యోగం కూడా చేయవచ్చంటూ ఓ ప్రముఖ దిగ్గజ కంపెనీ బంఫర్ ఆఫర్ ను ప్రకటించింది. ఇంతకి ఏమిటంటే..

  • Published Jun 15, 2024 | 1:16 PMUpdated Jun 15, 2024 | 1:20 PM
ఇంటర్ పాసై ఇంట్లో ఖాళీగా ఉన్నరా.. అయితే  IT రంగంలో గోల్డెన్ ఛాన్స్

ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఇంట్లోనే ఖాళీగా ఉన్నవారు చాలామంది ఉంటారు. అయితే వీరంతా పై చదువులు చదవడానికి ఆర్థిక స్థోమత లేకపోవడం, ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవ్వడం చేస్తూ ఉంటారు. ఇలా ఉంట్లోనే ఖాళీగా ఉండే బదులు ఏదైనా ఉద్యోగం చేస్తే చాలా బాగున్ను అని చాలామంది అనుకుంటారు. కానీ, ఈరోజుల్లో ఇంటర్మీడియట్ పై ప్రభుత్వ ఉద్యోగాలే తప్పా, ప్రైవేట్ ఉద్యోగాలు చేయడం చాలా కష్టం. ఎందుకంటే.. ఈ రోజుల్లో ప్రైవేట్ ఉద్యోగాలు చేయాలంటే.. కనీసం డీగ్రి ఉండాలి. మరి అలా ఇంట్లోనే ఇంటర్ చేసి ఏ జాబ్ లేక ఖాళీగా ఉన్నవారు కోసం తాజాగా ఓ ప్రముఖ దిగ్గజ కంపెనీ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. అయితే ఇంటర్ పాసైనా వారికి ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పవచ్చు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఇప్పటి వరకు ఇంటర్మీడియట్ పాసై ఇంట్లోనే ఏ జాబ్ లేక ఖాళీగా ఉన్నాం అని బాధపడుతున్నారా.. కానీ, ఇకపై ఆ చింత అవసరం లేదు. ఎందుకంటే.. ఇప్పుడు ఇంటర్ పాసై ఇంట్లోనే ఖాలీగా ఉన్నవారు ప్రభుత్వ ఉద్యోగాలకే పరిమితం కాదు ప్రవైట్ ఉద్యోగం కూడా చేయవచ్చంటూ ఓ ప్రముఖ దిగ్గజ కంపెనీ బంఫర్ ఆఫర్ ను ప్రకటించింది. ఇంతకి ఏమిటంటే.. ప్రముఖ దేశీయ సాఫ్ట్ వేర్ దిగ్గజం కంపెనీ హెచ్ సీఎల్ తాజాగా ఇంటర్ చదివిన విద్యార్థులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పుడు ఇంట్లోనే ఖాళీగా ఉంటూ ఉద్యోగం చేయాలనుకుంటున్న వారికి ఇంటర్న్‌షిప్‌తో పాటు గ్రాడ్యుయేషన్‌ అందిస్తూ సంస్థలో ఉద్యోగం కల్పిస్తోంది.అయితే ఈ ప్రోగామ్ ను హెచ్ సీఎల్ టెక్‌బీ పేరుతో నిర్వహిస్తుంది. అయితే ఇందుకోసం ఇంటర్ పూర్తయిన విద్యార్థులు ఐటీ సేవలకు తోడ్పడే డిజిటల్ సపోర్ట్ ఉద్యోగాల కోసం దరఖాస్తూ చేసుకోవాలని.. ఆ తర్వాత ఏడాది శిక్షణ అనంతరం హెచ్ సీఎల్ లో పూర్తి స్థాయిలో ఉద్యోగులుగా నియమితులవుతారని ఇంటర్ విద్యాశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఇక ఆసక్తిగల విద్యార్థులు వెంటనే అప్లయ్ చేసుకోవాలి అనుకునేవారు సంబంధిత సైట్ లోదరఖాస్తూ చేసుకోవచ్చు.

ఇక ఈ ఐటీ ఉద్యోగాలకు శిక్షణ మధురై, చెన్నై హెచ్‌సీఎల్‌ కేంద్రాల్లో నిర్వహిస్తారు. అయితే ఇందులో మొదటి మూడు నెలలు తరగతి గది శిక్షణ ఉంటుంది. ఆ తర్వాత తొమ్మిది నెలలు ఇంటర్న్‌షిప్‌ ఉంటుంది. పైగా స్టైపెండ్ కింద నెలకు రూ.10 వేలు కూడా ఇస్తారు. ఇక 12 నెలల పాటు సాగే ప్రోగ్రామ్ ముగిసిన తర్వాత.. హెచ్ సీఎల్ లో ఉద్యోగ అవకాశం కల్పిస్తారు. అయితే ఉద్యోగం సాధించిన తర్వాత.. ఏటా రూ.1.7 లక్షలు నుంచి రూ.2.2 లక్షల వరకు వేతనం చెల్లిస్తారు. ఇకపోతే ఈ రంగంలో ఐటీ, సర్వీస్‌ డెస్క్‌, బిజినెస్‌ ప్రాసెస్‌ విభాగాల్లో ఐటీ సర్వీసెస్‌, అసోసియేట్లు పోస్టులు ఉన్నాయి.కనుక ఆసక్తి ఉన్నవారు 7981834205, 9063564875, 8341405102లో సంప్రదించవచ్చని ఇంటర్‌ విద్యా శాఖ పేర్కొంది. అలాగే ప్రోగ్రామ్ కు ఎంపికైనా విద్యార్థులకు బిట్స్‌పిలానీ, ఆమిటీ, ట్రిపుల్‌ఐటీ కొట్టాయమ్‌, సస్త్రా యూనివర్సిటీ, కేఎల్‌ యూనివర్సిటీల నుంచి గ్రాడ్యుయేషన్‌ చేసే అవకాశం ఉంటుంది. విద్యార్థులు పూర్తి వివరాలను https://www.hcltechbee.com/ వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

అర్హతలు

  • ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులు సీఈసీ, హెచ్‌ఈసీ, బైపీసీ, ఒకేషనల్‌ కోర్సుల్లో 75 శాతానికి పైగా మార్కులు తప్పనిసరిగా ఉండాలి.
  • ఇక దరఖాస్తు చేసుకున్న వారికి హెచ్‌సీఎల్‌ కెరియర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ను నిర్వహిస్తారు.
  • అయితే ఇందులో ప్రతిభ చూపిన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
  • ఆ తర్వాత ఎంపికైతే కమ్యూనికేషన్‌ టెస్ట్‌ ఉంటుంది. ఈ మూడు ప్రక్రియల్లో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాన్ని అందజేస్తారు.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet