SNP
Harpreet Brar, Virat Kohli, IPL 2024: ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సూపర్ బ్యాటింగ్, డీకే ఫినిషింగ్‌ని అంతా ఎంజాయ్ చేశారు. కానీ, పంజాబ్ బౌలర్ మత్రం కోహ్లీని బాగా ఇబ్బంది పెట్టాడు. ఒక రకంగా భయపెట్టాడు. అతనెవరు? బ్యాక్‌గ్రౌండ్ ఏంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Harpreet Brar, Virat Kohli, IPL 2024: ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సూపర్ బ్యాటింగ్, డీకే ఫినిషింగ్‌ని అంతా ఎంజాయ్ చేశారు. కానీ, పంజాబ్ బౌలర్ మత్రం కోహ్లీని బాగా ఇబ్బంది పెట్టాడు. ఒక రకంగా భయపెట్టాడు. అతనెవరు? బ్యాక్‌గ్రౌండ్ ఏంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
ఐపీఎల్ 2024లో మరో హోరాహోరీ మ్యాచ్ జరిగింది. సోమవారం రాత్రి బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ చివరి ఓవర్ వరకు వెళ్లింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించింది. పంజాబ్ నిర్దేశించిన 177 పరుగుల టార్గెట్‌తో బరిలోకి ఆర్సీబీకి.. ఒక వైపు పంజాబ్ బౌలర్లు ఇబ్బంది పెడుతున్నా.. మరో ఎండ్‌లో కోహ్లీ చెలరేగి ఆడుతున్నాడు. డుప్లెసిస్, కామెరున్ గ్రీన్, పాటిదార్, మ్యాక్స్‌వెల్ ఇలా స్టార్లంతా పెవిలియన్ చేరినా.. కోహ్లీ ఒక్కడే పంజాబ్ బౌలర్లను బాదేస్తున్నాడు. కానీ, ఒక్క బౌలర్‌కు మాత్రం కోహ్లీ రెస్పెక్ట్ ఇచ్చి, సింగిల్స్ తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేస్తూ.. రిక్వైర్డ్ రన్‌రేట్ పెరిగిపోతున్నా.. ఆ ఒక్కడి బౌలింగ్‌లో మాత్రం చాలా జాగ్రత్తగా ఒళ్లు దగ్గరపెట్టుకుని ఆడాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని, గ్రౌండ్‌లో సెట్ అయినా.. ప్రపంచ మేటి బౌలర్ కగిసో రబాడ, అర్షదీప్ సింగ్ లాంటి బౌలర్లను వాయిస్తున్నా కూడా.. ఓ కుర్ర స్పిన్నర్ మాత్రం కోహ్లీ చేతులను కట్టేశాడు. ఇతని బౌలింగ్‌లో స్ట్రైక్ రాకుండా చాలా దేవుడే అనే రేంజ్‌లో కోహ్లీని భయపెట్టాడు పంజాబ్ స్పిన్నర్ హర్‌ప్రీత్ బ్రార్. పేరు చాలా విచిత్రంగా.. బౌలింగ్ ఎంతో పదునుగా ఉంది. విరాట్ కోహ్లీ, మ్యాక్స్‌వెల్ లాంటి దిగ్గజ ఆటగాళ్లనే ఇబ్బంది పెడుతున్న ఈ బ్రార్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
హర్‌ప్రీత్ బ్రార్ ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఒక సిక్కు కుటుంబంలో జన్మించాడు. తర్వాత వాళ్ల కుటుంబం పంజాబ్‌లో స్థిరపడింది. బ్రార్ తండ్రి సైనికుడిగా, పోలీసు అధికారిగా పనిచేశారు. పంజాబ్‌లోని మోగాలోని హరివాలా గ్రామంలో కొంతకాలం నివసించిన తర్వాత, బ్రార్‌కు ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు పంజాబ్‌లోని జిరాక్‌పూర్‌కు వెళ్లింది వాళ్ల కుటుంబం. చిన్నతనం నుంచే క్రికెట్‌పై ఆసక్తి పెంచుకున్న హర్‌ప్రీత్ బ్రార్.. క్రికెట్‌నే కెరీర్‌గా ఎంచుకున్నాడు. 2011లో రోపర్ జిల్లా జట్టుకు ఆడాడు. అనంతరం పంజాబ్ అండర్-16 టీమ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అయితే.. ఐపీఎల్‌లో 2019లో ఎంట్రీ ఇచ్చాడు బ్రార్. 2019 ఐపీఎల్ సీజన్‌కు గాను.. 2018 డిసెంబర్‌లో జరిగిన వేలంలో అతన్ని పంజాబ్ జట్టు బేస్ ప్రైజ్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది.
ఐపీఎల్ 2019లో ఆడిన తర్వాత టీమిండియా అండర్23 టీమ్ తరఫున కూడా బ్రార్‌కు ఆడే అవకాశం దక్కింది. 2019లో లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో బంగ్లాదేశ్ అండర్-23తో ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ఆడేందుకు భారత అండర్-23 జట్టుకు ఎంపికయ్యాడు. ఐపీఎల్ 2021లో బ్రార్ తన సత్తా చాటాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగిన బ్రార్.. తన తొలి ఐపీఎల్ వికెట్‌గా విరాట్ కోహ్లీని అవుట్ చేశాడు. అదే మ్యాచ్‌లో డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్‌లను కూడా బ్రార్ అవుట్ చేశాడు. మ్యాచ్‌లో కోహ్లీని, మ్యాక్స్‌వెల్‌ను బ్రార్ క్లీన్ బౌల్డ్ చేశాడు. అలాగే ఐపీఎల్ 2023, 2024 సీజన్స్‌లో కూడా మ్యాక్స్‌వెల్‌ను హర్‌ప్రీత్ బ్రారే అవుట్ చేయడం విశేషం. ఇలా ఐపీఎల్‌లో మంచి ప్రదర్శనలు ఇచ్చాడు.
సోమవారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన బ్రార్ కేవలం 13 పరుగులు ఇచ్చి.. రెండు వికెట్లు పడగొట్టాడు. అందులో మ్యాక్స్‌వెల్ వికెట్ కూడా ఉంది. అయితే.. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌ను, పేసర్‌ను ఆడేందుకు ఇబ్బంది పడే కోహ్లీ.. బ్రార్ బౌలింగ్‌లో కూడా ఇబ్బంది పడ్డాడు. రబాడ లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్‌ను ముందుకు వచ్చి మరీ కొట్టిన కోహ్లీ.. బ్రార్ బౌలింగ్‌లో మాత్రం చాలా జాగ్రత్తగా సింగిల్స్ మాత్రమే ఆడాడు. అప్పటికే రజత్ పాటిదార్, మ్యాక్స్‌వెల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు బ్రార్. పాటిదార్ అవుట్ అయ్యే ముందు.. కోహ్లీ కూడా బౌల్డ్ అయ్యే ప్రమాదం నుంచి కొద్దిలో తప్పించుకున్నాడు. మరి ఇలా ఓ ఛాంపియన్ బ్యాటర్‌ను ఇబ్బంది పెడుతున్న హర్‌ప్రీత్ బ్రార్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Kohli to Brar: abe ruk ja usko saans toh lene de🤣 pic.twitter.com/kgPIqyqjqX
— Nitin Mittal (@MittalNtweets) March 25, 2024
Harpreet Brar pulled PBKS back in the game with a superb spell. pic.twitter.com/shBVXmpX9r
— CricTracker (@Cricketracker) March 25, 2024